సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ సిఐటియు ఆధ్వర్యంలో జి పి కార్మికులకు వారి యొక్క డిమాండ్స్ ను పది రోజుల్లో పరిష్కరిస్తానని చెప్పిన గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రెండు నెలలైనా గ్రామపంచాయతీ కార్మికుల ఊసే లేదన్నారు. శీలం శ్రీను 34 రోజులుగా జి పి కార్మికులు సమ్మెలో భాగంగా గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమ్మె విరమించండి మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడంతో వారి మాట గౌరవించి సమ్మెను తాత్కాలికంగా సమ్మెను విరమించిన 15 రోజుల్లో మీ సమస్యలు పరిష్కరిస్తానని చెప్పిన ప్రభుత్వం రెండు నెలలైనా వారి యొక్క న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని సమస్యలు పరిష్కరించకపోవడంతో జి పి కార్మికులు రానున్న కాలంలో బి ఆర్ ఎస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారని వారు హెచ్చరించారు .తిరిగి జి పి కార్మికులు సమ్మెకు సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జి పి కార్మికుల సంఘం మండల అధ్యక్షుడు షేక్ అస్సానియా, వెంకటరెడ్డి, ఆర్ సైదులు, రామకృష్ణ, పున్నయ్య ,సి హెచ్ శీను పొదిళ్ల నాగరాజు ,సైదులు, నవీన్ ,రాముడు ,కాటమ రాములు, నాగేశ్వరావు, దానియేలు, వీరస్వామి, వెంకటేశ్వర్లు డి ,శ్రీనివాస్ రెడ్డి ,తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin