సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు, ప్రతీ నెలా జరిగే PMSMA (ప్రధానమంత్రి సురక్షా మాతృత్వ అభియాన్) లో భాగంగా ఈరోజు హై రిస్క్ గర్భవతులకు ప్రత్యేక పరీక్షలు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు డాక్టర్ బాను ప్రకాష్ 93మంది గర్భవతులను పరీక్షించడం జరిగింది. అందులో 13 మంది రక్త హీనత ఉన్న గర్భవతులను గుర్తించి, ఐరన్ సుక్రోజ్ ఇంజక్షన్స్ ఇవ్వడం జరిగింది. వచ్చిన గర్భవతులకు, ప్రసవ సమయం వరకు తీసుకోవలసిన జాగ్రత్తలు, సూచనలు వైద్యాధికారి తెలియచేయడం జరిగింది. షిరిడి సాయి బాబా గారిని ఆదర్శనంగా తీసుకొని, మానవ సేవే మాధవ సేవగా భావించి, తిప్పేపల్లి సర్పంచ్ A. రామచంద్ర రెడ్డి . ప్రతీ నెలా PMSMA ప్రోగ్రాంకు మారు మూల ప్రాంతాలనుండి వచ్చు గర్భవతులు మరియు వారితోపాటు వచ్చు వారికి, మరియు ఆరోజు వైద్యం కోసం వచ్చిన రోగులకు మరియు ఈ కార్యక్రమంలో పాల్గొనిన వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలకు అందరికి ఉచిత పౌష్టికాహారంను అందచేస్తున్నరు. ఈ కార్యక్రమం లో భాగంగా ఈరోజు మొత్తం 93 మందికి అన్నదానం చేయడం జరిగింది. వైద్య సిబ్బంది మరియు ఆసుపత్రికి వచ్చిన గర్భవతులు A.రామచంద్ర రెడ్డి ధన్యవాదాలు తెలియచేశారు.
-----------------------
Admin