సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట్ మండల పరిధిలోని కాకునూర్, వేముల్ నర్వ గ్రామంలో బొడ్రాయి, మైసమ్మ బోనాల పండుగలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన కేశంపేట్ జెడ్పిటిసి శ్రీమతి తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి. ఈ సందర్భంగా విశాల మాట్లాడుతూ.. శ్రీ కోట మైసమ్మ అమ్మవారి కృప ప్రజలందరిపై చల్లని దీవెన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ కాకునూరు, వేముల్ నర్వ గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ గండ్ర జగదీశ్వర్ గౌడ్, వైస్ ఎంపీపీ అనురాధ పర్వత రెడ్డి, కాకునూర్ గ్రామ సర్పంచ్ గండ్ర లక్ష్మమ్మ, వేముల్ నర్వ గ్రామ సర్పంచ్ కటికె మంజుల మల్లేష్, ఎంపీటీసీ మంజుల రాజశేఖర్, ఉప సర్పంచ్ గాండ్ల జ్యోతి, గ్రామస్తులు పాల్గొన్నారు..
-----------------------
Admin