Monday, 14 September 2026 10:07:42 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

హౌసింగ్ లక్ష్యాలను చేరుకునేందుకు కృషి చేయాలని... -జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్

Date : 28 February 2023 03:48 AM Views : 561

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : శ్రీ సత్య సాయి జిల్లాకు కేటాయించిన హౌసింగ్ లక్ష్యాలను చేరుకునేందుకు సంభందిత అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్ ఆదేశించారు. సోమవారం పుట్టపర్తి కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి హౌసింగ్, నాడు-నేడు, ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు, సచివాలయాల్లో అందిస్తున్న సేవలు, తదితర అంశాలపై ఆర్డీఓలు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, హౌసింగ్, డిఈలు, ఏఈలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, ఇతర క్షేత్రస్థాయి అధికారులతో శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్ మాట్లాడుతూ హౌసింగ్ పరిధిలో ఉగాది నాటికి సామూహిక గృహ ప్రవేశాలు జిల్లాలో 10,600 ఇళ్లు పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించడం జరిగిందని, వాటిల్లో ఇప్పటివరకు 2,336 ఇళ్లు పూర్తి చేయడం జరిగిందని, మిగిలిన ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకశిర, పెనుకొండ, పుట్టపర్తి అర్బన్, హిందూపురం, హిందూపురం అర్బన్, బుక్కపట్నం, తదితర ప్రాంతాల్లో పురోగతి తక్కువగా ఉందని, వెంటనే వేగం పెంచాలన్నారు. ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలైన గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్, తదితర భవన నిర్మాణాల్లో 60-70 శాతం పూర్తి కావడం జరిగిందని, ఆయా భవనాల్లో గ్రౌండ్ కానివి నాలుగైదు రోజుల్లో వెంటనే గ్రౌండ్ చేయాలన్నారు. బిబిఎల్ లో ఉన్నవాటి నిర్మాణాలు వేగవంతం చేయాలన్నారు. ఇప్పటివరకు మొదలు కానీ వాటి మంజూరు రద్దు చేయాలని, ఆయా భవన నిర్మాణాలకు సిమెంట్ మంజూరు చేసినా పనులు చేయని వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.సచివాలయాల సేవలకు సంబంధించి జిల్లాలో 33 సచివాలయాల్లో ఆధార్ అప్డేట్ చేయడం లేదని, కొన్ని సచివాలయాల్లో ఒక్కటీ చేయడం లేదని, ఎట్టి పరిస్థితుల్లోనూ జీరోలో ఉండరాదని, ఆధార్ అప్డేట్ చేయాలని, ఎంపిడిఓలు సున్నా లేకుండా చూడాలని, సచివాలయంలోనూ ఆధార్ సేవలు అందించాలని, ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పంచాయతీ రాజ్ పరిధిలో నాన్ ప్రయారిటీ పనుల కింద 836 సిసి, బిటి రోడ్ల పనులు మంజూరు కాగా, ఈ పనుల్లో 26 పనులు పూర్తి అయ్యాయని, మిగిలిన పనులను వేగవంతం చేయాలని సూచించారు. సచివాలయ ఉద్యోగుల బయోమెట్రిక్ అటెండెన్స్ ను ప్రతి రోజు పూర్తి స్థాయిలో నమోదు చేయాలని, సచివాలయాల్లో ల్యామినేషన్ సర్వీసులు చేపట్టాలని, మ్యారేజ్ సర్టిఫికెట్ లు మంజూరు చేయాలన్నారు. స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలలో భాగంగా జిల్లాలో 80 వేల మంది 0-5 ఏళ్ల మధ్య చిన్నారులు ఉండగా, 50 వేల మంది వరకు ఆధార్ అప్డేట్ చేయాల్సి ఉందని, చిన్న పిల్లల విషయంలో సోమ, మంగళవారం నిర్వహించే స్పెషల్ క్యాంపు లను ఉపయోగించుకోవాలన్నారు. 6-9 ఏళ్ల మధ్యలో 14 వేల మందికి, గర్భవతులు 2,300 మందికి ఆధార్ అప్డేషన్ చేయాల్సి ఉందని, వెంటనే ఆధార్ అప్డేషన్ చేసేలా చూడాలన్నారు. ఆయుస్మాన్ భారత్ లో భాగంగా లబ్ధిదారుల ఈకేవైసీ అప్డేషన్ ప్రక్రియని చేపట్టాలన్నారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హౌసింగ్ పీడీ చంద్రమౌళి రెడ్డి, పీఆర్ ఎస్ఈ గోపాల్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: