Thursday, 30 July 2026 04:49:14 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఆదిలాబాద్ జిల్లా సాంగ్వీ గ్రామం లో ఒకే సారి ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు...

Date : 25 April 2025 10:23 AM Views : 857

సర్కార్ టీవీ న్యూస్ / ఆదిలాబాద్ జిల్లా : ఆసిపాబాద్ జిల్లా జైనూర్ మండలంలో ఒకే పెళ్లి మండపంలో ఇద్దరి మెడలో ఆరుముళ్లేసి భళా అనిపించుకున్నాడు మరో యువకుడు. ఇళ్లంతా పందిరేసి వేలాది మంది బందువులను ఆహ్వానించి బాండ్ రాసిచ్చి మరీ ఇద్దరు యువతులను మనువాడాడు ఆదివాసీ యువకుడు. శుభలేఖలోనూ ఆ ఇద్దరు యువతులను పెళ్లి చేసుకుంటున్నట్లు ఒకే కార్డ్‌పై ముద్రించి బందువులను భారీగా ఆహ్వానించాడు. రెండు వేల మంది అతిథుల సాక్షిగా ఆ ఇద్దరి యువతుల మెడలో మూడు ముళ్లు.. స్వారీ ఆరు ముళ్లేసి ఇద్దరు భార్యల ముద్దుల మొగుడిగా మారాడు ఆత్రం చత్రుషావ్ అనే యువకుడు. ఈ విచిత్ర పెళ్లితంతు కొమురంభీం ఆసిపాబాద్ జిల్లా జైనూర్ మండలం అడ్డెసార ఆదివాసీ గ్రామంలో చోటు చేసుకుంది.సాంగ్వీ గ్రామానికి చెందిన సోన్ దేవి అనే యువతులను ఒకేసారి ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు ఆత్రం చత్రుషావ్. వీళ్ల మధ్య నాలుగేళ్ల కిందట చిగురించిన ప్రేమ ఆరు ముళ్లతో ముగ్గురిని ఒక్కటి చేసింది. అలా అని ఆ ఇద్దరు యువతులు అక్కా చెల్లెల్లో.. స్నేహితులో కాదు.. ఇద్దరు వేరు వేరు గ్రామాలకు చెందిన యువతులు. ఆ ఇద్దరి యువతుల ఆలోచన విధానం కూడా వేరే.. అయినా ఆ ఇద్దరిని ఒప్పించి ఆ ఇరువురు యువతుల కుటుంబాలను మెప్పించి ఈ ప్రేమ పెళ్లి చేసుకున్నాడు యువకుడు చత్రుషావ్.ఒక్క అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడమే గగనంగా మారిన ఈ రోజుల్లో ఇద్దర్ని ప్రేమించి.. ఒకే పెళ్లి మండపంలో ఒకే సమయంలో మనువాడడం సూపర్ అంటున్నారు ఈ పెండ్లి వేడుక చూసిన అతిథులు. అంతే కాదు ఈ ఇద్దరికీ భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బందులు కూడా రాకుండా చూసుకుంటానని ఓ బాండ్ పేపర్ కూడా రాసి ఇవ్వడం మరింత చర్చనీయాంశం అయింది. ఇద్దరు‌ అమ్మాయిల తల్లిదండ్రులు ఆ ఒప్పందానికి ఒకే చెప్పడంతో ఇదిగో ఇలా ముగ్గురు వివాహ బంధంతో ఇలా ఒకటయ్యారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :