సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుళదేవరచెరువు మండలంలో కొండకమర్ల లో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుక బుధవారం ఓబుల దేవర చెరువు మండలంలోని కొండకమర్లలో సింగల్ విండో అధ్యక్షులు ఎద్దుల రామసుబ్బారెడ్డి, కోఆప్షన్ సభ్యులు పొగాకు నిషార్ అహ్మద్ ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. కొండకమర్లలోని వైయస్సార్ విగ్రహం ముందు ఆపార్టీ నాయకులు కేక్ కట్ చేసి, జగనన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఒకరికి ఒకరు కేకును తినిపించుకొన్నారు. అనంతరం ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పిలుపు మేరకు గ్రామంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. వైసిపి మండల ఎస్సీ సెల్ నాయకుడు లక్ష్మీపతి, తదితరులు రక్తదాన శిబిరానికి హాజరై, వైద్య సిబ్బందికి రక్తాన్ని ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాసుల రెడ్డి, ఓడిసి టౌన్ కన్వీనర్ కోళ్ల క్రిష్ణారెడ్డి, సర్పంచు శ్రావణి, కదిరి ఆలయ కమిటీ సభ్యులు లక్ష్మి నారాయణ రెడ్డి, వైసీపీ నాయకులు రమణ, మధన్ మోహన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, హోటల్ లక్ష్మీనారాయణ, దుర్గాప్రసాద్, లక్ష్మీపతి, హనుమంతు నాయక్, అంజనప్ప తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin