సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : దేవరకొండలో ఎరువుల వ్యాపారుల సిండి‘కేటు’ -శ్రీ సత్యసాయి, శ్రీ వెంకటరమణ, శ్రీరామ, విగ్నేశ్వర, జె ఎన్ ఆర్, శ్రీ సాయి ఎంటర్ప్రైజెస్ వాళ్ళు నకిలీ విత్తనాలను అమ్ముతు రైతులను మోసం చేశారాని దేవరకొండలో ధర్నా... -దేవరకొండ నియోజకవర్గంలో నకిలీ విత్తనాలను అమ్ముతున్నారని రైతుల ఆరోపణలు -నకిలీ విత్తనాలు అమ్ముతు రైతులను మోసం చేసిన డీలార్లపై చర్యలు తీసుకివాలి -పోలీసు స్టేషన్లో పిర్యాదు చేసిన రైతులు -యూరియా బస్తాపై 20, నుంచి 30 రూపాయలు అదనంగా వసూలు -ఎరువులు, ఫెస్టిసైడ్, విత్తనాలను ఉద్దేరకు ఇస్తూ ఆ డబ్బుపై అధిక వడ్డీలు వేస్తూ మోసం -పత్తి కొనుగోళ్ల సమయంలోనూ తూకంలో మోసాలు -విత్తనాలను అధిక ధరలకు విక్రయిస్తున్నా సంబంధిత అధికారులు అటు వైపు కన్నేత్తి చూడటం లేదు -సిండికేట్ వ్యాపారంపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి -ప్రతి గ్రామంలో కొంత మంది బ్రోకర్లుగా పెట్టుకుని అక్రమ ఎరువులు, విత్తనాలు, ఫెస్టిసైడ్ మందులు విక్రయిస్తున్నా యజమానులు దుకాణాల నుంచి ఎరువులను కొనుగోలు చేస్తున్న రైతులు నల్లగొండ అక్టోబర్ 23, సర్కార్ టీవీ న్యూస్ : నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని, అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే లైసెన్సులు రద్దు చేస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా ఎరువుల వ్యాపారుల్లో ఎటువంటి మార్పు కనిపించడం లేదు. దేవరకొండ మండలంలోని ఫర్టిలైజర్ దుకాణాల్లో సిండికేట్ దందా ప్రారంభించి రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. రైతులకు కావల్సిన ఎరువులు, ఫెస్టిసైడ్, విత్తనాలను ఉద్దేరకు ఇస్తూ ఆ డబ్బుపై అధిక వడ్డీలు వేస్తూ మోసం చేస్తున్నారు. దీనికితోడు రైతులు పంట వచ్చిన తర్వాత ఆ పంటను ఉద్దెర ఇచ్చిన ఫర్టిలైజర్ దుకాణాదారులకే విక్రయించాలనే ఒప్పం దంపై ఎరువులు,విత్తనాలు ఎరువులు ఇస్తున్నారు. పత్తి ధర కూడా వారు చెప్పిన దానికే అమ్మాలి. ఉద్దెర సొమ్ముకు వందకు రూ. 3 వడ్డీని వసూలు చేస్తూ రైతుల నడ్డి విరిస్తున్నారు. పత్తి కొనుగోళ్ల సమయంలోనూ తూకంలో మోసాలకు పాల్పడుతూ అందినకాడికి దోచుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఈ దందా దేవరకొండ మండలంలో యథేచ్ఛగా కోనసాగుతుంది. ఒక్కో గ్రామం ఒక్కో దుకాణం.. మండలంలో సుమారు 50 ఫర్టిలైజర్ దుకాణాలున్నాయి. పేరుకు ఇవి ఉన్నా ప్రతి గ్రామంలో అక్రమంగా ఎరువులు, విత్తనాలు విక్రయిస్తున్నారు. ఈ వ్యాపారులంత సిండికెట్‌గా మారి యూరియా బస్తాపై 20, నుంచి 30 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. ఉద్దెర తీసుకున్న రైతులు మాత్రం ఏమీ అనడం లేదు. నగదు ఇచ్చి కొనుగోలు చేసే రైతులు ప్రశ్నిస్తే ఇదే ధరకు ఇస్తాం కొంటే , కొనండి లేకుంటే మీ ఇష్టం అని దురుసుగా సమాధానం ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎరువుల బిల్లు మాత్రం ఉన్న రేటు వేసి, అదనంగా వసూలు చేసేది వేయడం లేదని రైతులు వాపోతున్నారు. ఈ విషయంపై వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేసినా ఏమీ లాభం లేకుండా పోతుంది. ఈ వ్యాపారులు అందరూ ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లు ఆ గ్రామంలో వేరే దుకాణాల వారు విక్రయించొద్దని నిబంధనలతో విక్రయిస్తున్నారు. ఒక షాప్ వారు అమ్మే ఊరికి వేరే దుకాణాల వారు అమ్మోద్దని నిబంధనతో విక్రయిస్తున్నారు గ్రామానికో బ్రోకర్.. దుకాణదారులు ఈ మండలంలో ప్రతి గ్రామంలో కొంత మంది బ్రోకర్లుగా పెట్టుకుని అక్రమ ఎరువులు, విత్తనాలు, ఫెస్టిసైడ్ మందులు విక్రయిస్తున్నారు.చింతబావి కేంద్రంగా ఎటువంటి అనుమతులు లేకుండా జీరో దందా జోరుగా సాగుతోంది. ఒక్కో వ్యాపారి కోటి రూపాయలపైనే ఉద్దెర ఇస్తూ రైతులను మోసం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. గ్రామాలలో గుంటూరు నుండి నకిలీ విత్తనాలు తెచ్చి రైతులకు అమ్ముతున్నారని, దీనివల రైతులు నష్టపోతున్నారు. వ్యవసాయాధికారులు విచారణ జరిపినా అలాంటి వ్యాపారులపై ఏలాంటి చర్యలు తీసుకోవడంలేదు. అధిక ధరలకు విక్రయిస్తున్నా సంబంధిత అధికారులు అటు వైపు కన్నేత్తి చూడటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ఈ సిండికేట్ వ్యాపారంపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. తీవ్రంగా మోసం చేస్తున్నారు:కేతావత్ మాకట్ లాల్, రైతు ఫర్టిలైజర్ షాపు యజమానులు రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిలువునా మోసం చేస్తున్నారు. ఉద్దెర పెరుతో అధిక ధరలకు మందులకు అమ్ముతూ నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇదే అదనుగా భావించి నకిలీ మందులు, విత్తనాలు అమ్ముతున్నారు. గత ఏడాది నకిలీ విత్తనాలతో తీవ్రంగా నష్టపోయాం.
-----------------------
Admin