సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : లక్ష్మిదెవిపల్లి : మండల పరిధిలోని ప్రశాంత్ నగర్ కాలనీ లోతువాగు గ్రామాల్లో జనసేన కొత్తగూడెం నియోజకవర్గ ఇంచార్జి వేముల కార్తిక్ గురువారం పర్యటించారు. అక్కడ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ...ప్రశాంత్ నగర్ కాలనీ లో ప్రజలు సైడ్ కాల్వలు, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక చాలా ఇబ్బంది పడుతున్నట్లు ప్రజలు చెప్పారు....తక్షణమే ప్రభుత్వం స్పందించి సరైన సైడ్ కాల్వలు నిర్మించాలిసిందిగా జనసేన తరుపున డిమాండ్ చేసారు. అలాగే వచ్చే ఎన్నికలలో కొత్తగూడెం లో జనసేన పోటీ చేస్తునందన్నారు. జనసేన కి ఓట్ వేసి గెలిపించాలని జనసేన నాయకులు కొత్తగూడెం టౌన్ ప్రెసిడెంట్ సాదిక్ పాషా, సెక్రటరీ సాయి అనిత్, పాల్వంచ మండలం వైస్ ప్రెసిడెంట్ గజ్జల సంపత్ రామ్ వర్మ, నాగ సాయి హర్షవర్ధన్,దుర్గలు కోరారు.
-----------------------
Admin