సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : ప్రజా పాలన దరఖాస్తుల డేటా ఎంట్రీని పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ నియోజక వర్గాల ప్రత్యేక అధికారులను ఆదేశించారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో ప్రజాపాలన దరఖాస్తుల డేటా ఎంట్రీ పై ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్లు సి.హెచ్. ప్రియాంక, ఏ. వెంకట్ రెడ్డి లతో కలసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 489 బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని , డేటా ఎంట్రీ ఆపరేటర్ల కు 5వ తేదీన కలెక్టరేట్ నందు డేటా ఎంట్రీ విధివిధానాలపై ఉదయం 10.30 కి ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో ప్రజాపాలన చివరి రోజు వరకు దాదాపు 4 లక్షల దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. జిల్లాలో 475 జి.పి లకు గాను 389 బృందాలు అలాగే ఐదు మున్సిపాలిటీలు 100 బృందాలు నియమించామని పేర్కొన్నారు. డేటా ఎంట్రీ లో ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఎంట్రీ ఆపరేటర్ల మౌలిక సదుపాయాలు కల్పించాలని 5వ తేదీన నియోజక వర్గ మండలాల వారీగా సబందిత అధికారులతో వెబెక్స్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతుందని ముందుగా 6.00 గంటలకు హుజూర్ నగర్, కోదాడ 6.45, సూర్యాపేట 7.30 అలాగే తుంగతుర్తి 8.15 గంటలకు కాన్ఫరెన్స్ ఉంటుందని ప్రత్యేక అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీఓ లు, కౌంటర్ ఇంఛార్జీలు తప్పక పాల్గొనాలని కలెక్టర్ ఈ సందర్బంగా సూచించారు. ఈ సమావేశంలో జెడ్.పి. సి.ఈ. ఓ సురేష్ కుమార్, డిఆర్డీఓ. కిరణ్ కుమార్, డి.పి.ఓ యాదయ్య, సి.పి.ఓ జి. వెంకటేశ్వర్లు, డి డెబ్లు ఓ జ్యోతి పద్మ, డి ఎం హెచ్ ఓ డా. కోటా చలం, ఏ.ఓ సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin