సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అశ్వరావుపేట నియోజకవర్గం చండ్రుగొండ మండలం , అంకిరెడ్డి కృష్ణారెడ్డి, మరియు బంకు శేఖర్, ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ, గ్రామాలలో ప్రజలలో ఎంతో ఆదరణతో దూసుకుపోతున్నది. చండ్రుగొండ మండలం పరిధిలోని అయ్యన్నపాలెం గ్రామానికి చెందిన గత కొన్ని సంవత్సరాలుగా టిడిపి పార్టీలో కొనసాగుతున్న పదిహెను కుటుంబాల ప్రజలు అంకిరెడ్డి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరి ఖండావలు కప్పుకున్నారు. అంతేకాకుండా అదే గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ కి చెందిన పది కుటుంబాల ప్రజలు ఆ పార్టీ మీద విరక్తి చెంది ఈ పది సంవత్సరాలలో మాకు ఆ పార్టీ తరపు నుండి ఎటువంటి లబ్ధిగాని సహాయక సహకారాలు కానీ అందలేదు అని ఆ పార్టీకి ఎంత సేవ చేసినా కనీసం మమ్మల్ని గుర్తించలేదని బాధపడుతూ ఆవేదనకు గురై అక్టోబర్ 30 తేదీన ఈ పది హెను కుటుంబాల ప్రజలు నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరినారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి వెన్నంటు ఉండి ఎలక్షన్లో గెలిపిస్తామని హామీ ఇచ్చినారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి అంకిరెడ్డి కృష్ణారెడ్డి బంకు శేఖర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు..
-----------------------
Admin