సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభ శంకుస్థాపన నిమిత్తం విచ్చేసిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. శంకుస్థాపన అనంతరం రామవరం సెంటర్లో ఏర్పాటుచేసిన సభలో పాల్గొన్నారు. సభలో కొత్తగూడెం శాసనసభ్యులు వరమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, నన్ను ఎమ్మెల్యేగా పోటీ చేయమని కొత్తగూడెం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆదేశించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు కార్యక్రమంలో శంకుస్థాపన కొరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారిని పంపించడం జరిగిందన్నారు. కిన్నెరసాని జలాన్ని కొత్తగూడానికి అందించడం జరిగిందన్నారు. రోడ్ల విస్తరణకు, డ్రైనేజీలకు, సెంట్రల్ లైటింగ్ లకు అనేక ఆధునికరణ, మౌలిక సదుపాయాల కొరకు ప్రత్యేక నిధులు కేటాయించడం జరిగిందన్నారు. వార్డ్ మెంబర్గా, ఎంపీగా, ఎమ్మెల్యేగా చేశానని వనమాగారన్నారు. కొత్తగూడానికి సేవ చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ గారు నన్ను ఆదేశించడం జరిగిందన్నారు. పువ్వాడ అజయ్ కుమార్ కోరిక మేరకు ముఖ్యమంత్రి గారు కొత్తగూడెం నియోజకవర్గం అభివృద్ధి కొరకు 75 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వడం జరిగిందని, కొత్తగూడెం నియోజకవర్గం బ్రహ్మాండంగా ఉంది చాలా అభివృద్ధి చెందుతుందని ఇలానే అభివృద్ధి చేస్తూ ఉండు నీ వెనుక నేనున్నానని హామీ ఇచ్చారని వనమా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఉద్దేశించి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ, కొత్తగూడెం నియోజకవర్గం చరిత్రలో ఒక శిలాఫలకం మీద 75 కోట్లు రూపాయలు ఒకే శిలాఫలకం మీద ఉన్న చరిత్ర కొత్తగూడెం నియోజకవర్గందని, 75 సంవత్సరాల స్వతంత్ర చరిత్రలో కొత్తగూడెం మున్సిపాలిటీకి ఓకే శిలాఫలకంపై 75 కోట్ల రూపాయల రికార్డ్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సెల్యూట్ చేయాలన్నారు. పాల్వంచ మున్సిపాలిటీకి 60 కోట్ల రూపాయలు కొత్తగూడెం మున్సిపాలిటీకి 75 కోట్ల రూపాయలు మొత్తం 135 కోట్ల రూపాయలు శంకుస్థాపన నా చేతుల మీదుగా జరగడం నా పూర్వజన్మ సుకృత్వం అని కొనియాడారు. కొత్తగూడెం నియోజకవర్గానికి అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రిని ఒప్పించి పెద్ద మొత్తంలో నిధులు తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయమని పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.
-----------------------
Admin