Saturday, 18 April 2026 08:08:01 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి సతీమణి రమాదేవి కంటతడి...

Date : 23 November 2023 07:44 AM Views : 256

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : మీరు అసలు మనుష్యులేనా ఎందుకు? మా కుటుంబాన్ని మానసిక క్షోభ పెడుతున్నారు. గుండె నొప్పితో ఆస్పత్రిలో చేరిన తన భర్త పై వాట్సాప్ గ్రూపుల్లో కొందరు విష ప్రచారం చేస్తున్నారు.. మీకు మనసు లేదా? మానవత్వం లేదా? నా కుటుంబంలో చిన్న పిల్లలు కూడా కంటతడి పెట్టుకుంటున్నారు. మేము చేసిన తప్పు ఏంటి? సేవ చేయడం తప్పా అంటూ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ షాద్ నగర్ అసెంబ్లీ అభ్యర్థి పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి సతీమణి రమాదేవి మీడియా ముందు కన్నీటి పర్యంతమయ్యారు. బుధవారం విష్ణువర్ధన్ రెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రమాదేవి తన కూతురు, కుమారుడుతో కలసి మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన భర్త పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర అనారోగ్యంతో అస్వస్థతకు లోనై గుండె సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని పేర్కొన్నారు. వైద్యులు విష్ణువర్ధన్ రెడ్డి ఆరోగ్య సమస్యపై 40 శాతం గుండె నాళాలు బ్లాక్ అయ్యాయని చెప్పారని, ఇతర చికిత్సలు కూడా నడుస్తున్నాయని తెలిపారు. లోబిపి, లోషుగర్, 101 జ్వరం తన భర్తను వేధిస్తుందని ఆయన ఆరోగ్యం పట్ల కుటుంబ సభ్యులు ఆయన అభిమానులు కార్యకర్తలు ఆందోళనతో ఉన్నారని చెప్పారు. ఎంతో బాధగా ఉన్న తమ కుటుంబాన్ని మరింత మానసిక శోభకు కొంతమంది గురి చేస్తున్నారని ఆమె కంటతడి పెట్టుకున్నారు. వాట్సాప్ గ్రూపులో పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి పై అభ్యంతరకర వ్యాఖ్యలతో కొంతమంది బిజేపి కార్యకర్తలు పోస్టులు చేసి పైశాచికానందం పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సేవ మార్గాన్ని ఎన్నుకొని రాజకీయాల్లో తన పంతాను కొనసాగిస్తున్న విష్ణువర్ధన్ రెడ్డి అస్వస్థతకు గురై అనారోగ్యంతో ఆస్పత్రిలో చేర్చితే ఆయనపై దయలేని విధంగా వాట్సాప్ గ్రూపులో అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తుండడం ఏమిటని ప్రశ్నించారు. తన భర్త సమాజసేవ కోసం కుటుంబాన్ని, ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా తన లక్ష్యం కోసం పనిచేస్తున్నారని నియోజకవర్గంలో ఎందరో అక్కాచెల్లెళ్లకు అన్నగా నిలిచారని, మహిళలకు ఒక బిడ్డగా, పేదలకు ఒక తండ్రిగా బాధ్యత తీసుకొని సామాజిక సేవలు చేస్తున్నారని ఆక్రందన వ్యక్తం చేశారు. ఒక గొప్ప మనసుతో సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి అనారోగ్యం పాలైతే తమ మనసును బాధపడే విధంగా సోషల్ మీడియాలో విచిత్రమైన కామెంట్స్ పెడుతున్నారని ఇలాంటివి మానుకోవాలని ఆమె చేతులతో దండం పెట్టి కోరారు. తన పిల్లలు నాన్న ఎప్పుడు వస్తారని ? ఎదురు చూస్తుంటే తమ రాజకీయ ప్రత్యర్థులు మాత్రం విష్ణు పని అయిపోయింది.. ఎన్నికలకు ముందు ఏదో జరిగింది.. అంటూ తమ మనసును బాధపెట్టే విధంగా కామెంట్స్ పెడుతుండడం పట్ల ఆమె కన్నీరు మున్నీరుగా విలపించారు. వెంటనే ఆయన గుండెకు స్టంట్ వేయాలని వైద్యులు చెబుతుండగా దానికి విష్ణువర్ధన్ రెడ్డి నిరాకరిస్తున్నారని, తన శరీరం కూడా సహకరించని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ఎన్నికల్లో తన లక్ష్యం కోసం పనిచేసేందుకు ప్రాణాన్ని సైతం లెక్కచేయకుండా విష్ణువర్ధన్ రెడ్డి స్టంట్ వేసుకోవడం లేదని దానికి సంబంధించి తమకు కుటుంబ కౌన్సిలింగ్ కూడా వైద్యులు చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఎంతో బాధాకరమైన పరిస్థితిలో ఉన్న తమ కుటుంబానికి కార్యకర్తలు అభిమానులు మీడియా అండగా నిలబడగా మరికొంతమంది మాత్రం ప్రత్యర్ధులు సూటిపోటి మాటలతో సోషల్ మీడియాలో తమ మన మనసును బాధపెట్టే విధంగా ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. ఎవరికి ఇలాంటి పరిస్థితి రావద్దని అన్నారు. ఎన్నికల్లో ఖర్చు నుండి తప్పించుకోవలసిన ఖర్మ తన భర్తకు పట్టలేదని పేర్కొన్నారు. తన సగం ఆస్తి ట్రస్టుకు రాసిచ్చారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాజకీయాల్లో విలువలతో రాజకీయం చేస్తున్నామని ఎవరికి చూపించడానికి కాదని అన్నారు. లక్ష్యం వైపు దూసుకెళ్తున్న తన భర్త విష్ణువర్ధన్ రెడ్డి నిత్యం ప్రజల గురించి ఆలోచిస్తున్నారని అలాంటి వ్యక్తిపై నిందలు వేస్తే తగదని అన్నారు. బిజెపిలో టికెట్ దూరం చేసి తమను ఎంతో బాధపెట్టారని నాలుగేళ్లపైగా బిజెపి గుర్తుతో ఆయన ప్రజల్లో సేవలు చేశారని కుట్రపూరితంగా ఆ గుర్తును దూరం చేశారని పేర్కొన్నారు. సింహం గుర్తుతో ధైర్యంగా ఎన్నికల్లో తిరుగుతున్నారని తమ దురదృష్టం ఆయనకు ఆరోగ్యం బాలేదని పేర్కొన్నారు. ఇటీవలే పీర్లగూడలో ప్రచార వాహనాన్ని కొందరు వెంబడించి రాళ్లతో కొట్టారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనారోగ్యం పేరిట నాటకం ఆడాల్సిన అవసరం తమకు లేదని ఆమె పేర్కొన్నారు. విష్ణువర్ధన్ రెడ్డి ఉద్వేగానికి లోనైతే ఆయన గుండెకు ప్రమాదం అని డాక్టర్లు చెప్పారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. దయచేసి అనవసరంగా ఆయనను మరింత బాధ పెట్టవద్దని ఆమె మీడియా సాక్షిగా విజ్ఞప్తి చేశారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :