Monday, 14 September 2026 05:40:02 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

"నిలువురాళ్లు" విద్యామాస పత్రిక... విద్యార్థుల ప్రగతికు పునాది రాళ్లు...

Date : 08 February 2024 03:43 PM Views : 281

సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : జిల్లా విద్యాశాఖ కార్యాలయ అధికారులు, విద్యా ప్రగతి స్ఫూర్తిదాయక కథనాల మాసపత్రిక నిలువురాళ్లు ప్రతిని గౌరవ శాసన సభ్యులు డా. చిట్టెం పర్ణిక రెడ్డి మరియు వాకిటి శ్రీహరి లకు జిల్లా ఏఎమ్ఓ విద్యాసాగర్, ఎస్.ఓలు నాగార్జున రెడ్డి, శ్రీనివాసులు సీఎమ్ఓ రాజేందర్ అందజేశారు. ఈ సందర్భంగా డా. చిట్టెం పర్ణిక రెడ్డి గారు మాట్లాడుతూ, విద్యాభివృద్ధికి తాను ఎల్లపుడు ముందుంటానని, చిన్నారులతో మాట్లాడడం ఉపధాయ్యులను ప్రోత్సహించేలా వారి ఉత్తమ పద్ధతులను జిల్లా అంతటా తెలియజేసే పత్రికను తీసుకువచ్చిన విద్యాశాఖను అభినందించారు. వాకిటి శ్రీహరి గారు మాట్లాడుతూ, విద్యకు తన నిధులల్లో 35% కేటాయిస్తానని, స్థానిక ముడుమాల్ నిలువురాళ్ళ ఖ్యాతిని అందరికి తెలియజేసేలా మౌలిక సదుపాయాలను కల్పిస్తానని, విద్యార్థులకు,పాఠశాలభివృద్ధికి ఎల్లపుడు సహాయం అందిస్తానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం లో మొదటి సారి మన జిల్లా నుండి విద్య మాస పత్రిక వెలువడడం అభినందనియం అన్నారు. ఉపాధ్యాయులు తాము పాఠశాలలో కనబరచిన విద్యార్థుల సృజనాత్మకత, ఉత్తమ కార్యక్రమాల అంశాలను పేర్కొంటూ రూపొందుతున్న ఈ పత్రిక అభినందనీయమని, ఈ మాస పత్రిక లో జిల్లా విద్యాశాఖ, ఉపాధ్యాయులందరూ స్పందించి తమ రచనలను, అమూల్యమైన సూచనలను అందజేస్తూ మాసపత్రికను ప్రతినెల విజయవంతం చేయాలని కోరారు. అదే విధంగా మాసపత్రిక రచనకు కృషి చేసిన డిఆర్పి బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణ రాష్ట్రంలో నారాయణపేట జిల్లా విద్యాశాఖ నుండి నిలువురాళ్లు పేరుతో వెలువ డుతున్న ఈ విద్యా ప్రగతి సంచిక జిల్లాలో ఉన్నటువంటి 672 ప్రభుత్వ,ప్రయివేటు పాఠశాలకు దాతల సహకారంతో ఉచితంగా అందించబడుతుంది. ఈ సంచికలో పాఠశాల యొక్క అభివృద్ధి, బాల బాలికల యొక్క మానసిక వికాసం కొరకు అంశాలు, పాఠశాలలో జరుగుతున్నటువంటి ముఖ్యమైన దినోత్సవాలు , సులభతరమైనటువంటి బోధన వ్యూహాలు, ఉత్తమ ఫలితాల పాఠశాల వివరాలు, పిల్లల సృజనాత్మక అంశాలు, సూక్తులు క్విజ్ తదితర అంశాలను పొందుపరిచి ప్రతినెల ఈ మాసపత్రికను పాఠశాలలకు చేరవేస్తామని సంపాదకులు ఏఎంఓ విద్యాసాగర్ గారు పత్రికా ప్రకటనలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రిసోర్స్ పర్సన్స్ నరేందర్, రాఘవేంద్ర, శ్రీనివాస్, శ్రీకాంత్, భాస్కర్ రెడ్డి , అపర్ణ ,శెట్టి వెంకటేష్ లు తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: