Saturday, 18 April 2026 06:14:51 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

తెలంగాణ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం మండల స్థాయి సమావేశం...

Date : 23 October 2023 04:23 AM Views : 452

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండలం స్థానిక విఎల్అర్ ఫంక్షన్ హాల్ లో మఠంపల్లి మండల తెలంగాణ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఆర్ఎంపి,పియంపి అధ్యక్షులు జాల తిరుపతయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి అధ్యక్షుడు ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి హాజరైనారు.ఆ యూనియన్ యొక్క రాష్ట్ర నాయకులు ఆర్.ఎం.పి బ్రహ్మం పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన యూనియన్ సమావేశంలో ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో ఆర్ఎంపి,పిఎంపీల సేవలు మరువలేనివని,మనిషి ప్రాణపాయంలో ఉన్నప్పుడు, ముందుగా ప్రధమ చికిత్స చేసి ప్రాణాన్ని కాపాడే వ్యక్తులు ఆర్ఎంపి,పిఎంపి డాక్టర్ లేనని తెలియజేశారు.ఈ సందర్భంగా యూనియన్ నాయకులు కోరిన కోరికలను తప్పక నెరవేరుస్తామని హామీ ఇచ్చారు.ఆర్ఎంపి పీఎంపీలకు ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి ప్రత్యేకమైన శిక్షణ తరగతులు నిర్వహించి వారికి ప్రభుత్వపరంగా ప్రత్యేక గుర్తింపుగా సర్టిఫికెట్స్ అందజేస్తామని సందర్భంగా తెలియజేశారు. మండల కేంద్రంలో వారికి స్థలాన్ని కేటాయించి యూనియన్ బిల్డింగ్ ని ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి వారికి హామీ ఇచ్చారు.ఎప్పుడు ప్రజల మధ్య ఉండే నాయకున్ని అని ఎమ్మెల్యే గా అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం ద్వారా అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందించనని మరోసారి నన్ను ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం మండల ఉపాధ్యక్షులు పుల్లయ్య, ప్రధాన కార్యదర్శి రామారావు, కార్యదర్శి వెంకటేశ్వర్లు,సర్పంచ్ మన్నెం శ్రీనివాస్ రెడ్డి,గౌరవ అధ్యక్షులు సత్యనారాయణ, గ్రామీణ వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :