సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : నాసా పోటీ పరీక్షలో షాద్ నగర్ శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. గత కొన్ని రోజుల క్రితం నాసా ప్రాజెక్ట్ చేసి పంపించారు. ఈ నాసా ప్రాజెక్టులో మొత్తం 49 మంది విద్యార్థులు పాల్గొనగా అందులో 18 మంది విద్యార్థుల ప్రాజెక్టులకు మొదటి, రెండవ బహుమతులు గెలుచుకున్నారు. మొదటి ప్రాజెక్టు (ఓలియాండర్) విజేతలు వి సాయి మనోనిల్, సంకీర్త్, డి సౌఖ్య, డి చైతన్య, సిహెచ్ అనుష్ణ, ఈ శిరీష, టి సాయి ప్రణీత్, హరుణ్ అహ్మద్, డి హాసిని, వి వరుణ్ చారి విజేతలుగా నిలిచారు. రెండవ ప్రాజెక్టు (లాచ్ లన్) లో మహమ్మద్ మొయిజ్, యు శ్రీభార్గవి, పి పృధ్వీరాజ్, పి హర్షవర్ధన్, ఎన్ ప్రణయ్ రెడ్డి, డి మైథిలి, కె పరిణీత, పి సృజన శ్రీ విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా నా ప్రాజెక్టులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపల్ ఆనంద్ మరియు సిబ్బంది అభినందించారు. భవిష్యత్తులో మంచి సైంటిస్టులుగా ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ శ్రీధర్, చైర్మన్ శ్రీ విద్య, డీజిఎం సుధాకర్, అర్ ఐ రఘు, ప్రిన్సిపల్ ఆనంద్, అకాడమిక్ డైరెక్టర్ మధు, డీన్ తిరుమల్ రెడ్డి, సి బ్యాచ్ ఇంచార్జ్ వీరేందర్, నాసా ఇంచార్జ్ సాయికుమార్, ఉపాధ్యాయుల బృందం తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin