సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : గ్రామపంచాయతీ సర్పంచిగా ఎన్నికైన ఉత్తరేణి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ సర్పంచ్ ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించి గెలిపించినందుకు గ్రామ ప్రజలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు అధికారులు సోమవారం ప్రమాణ స్వీకారం చేయించారు ప్రమాణ స్వీకారం అనంతరం నూతన పాలకవర్గ సభ్యులను కూడా ప్రమాణ స్వీకారం చేయించారు అందరిని శాలువాలతో సత్కరించారు అనంతరం నూతన సర్పంచ్ ఉత్తరేణి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు గ్రామ అభివృద్ధి ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తానని ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా కృషి చేస్తానని తెలిపారు గ్రామంలో విద్య ఆరోగ్య అభివృద్ధి మౌలిక సదుపాయాలు ప్రత్యేక దృష్టి తీసుకుంటానని ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని అలాగే ప్రజా ప్రతినిధులు అధికారుల సమన్వయంతో పని చేస్తే గ్రామం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని అందరి సహకారంతో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తానని అన్నారు బస్సు సౌకర్యాన్ని అతి తొందరలో వచ్చే విధంగా చేస్తానని వాటర్ ప్లాంట్ రోడ్లు డ్రైనేజీలు వీధిలైట్లు సమస్యలు అన్నింటిని ఒక్కొక్కటిగా పూర్తి చేస్తానని అదేవిధంగా మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని సాయి శక్తుల పనిచేస్తానని ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని సర్పంచ్ ఉత్తరేణి భాగ్యలక్ష్మి గ్రామస్తులకు హామీ ఇచ్చారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బాధ్యతలు తీసుకున్న వెంటనే ఇచ్చిన హామీలలో మొదటి సంతకం 25 లక్షల సిసి రోడ్డు నిర్మాణ పనులకు సంతకం చేశారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Reporter