సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : రామవరం : రామవరం ప్రాంత ప్రజలకు గృహలక్ష్మి పథకం అమలు చేయాలని,పథకంలోని ఇంటి స్థలానికి రిజిస్టర్ పట్టా కావాలనే నిబంధనను రామవరం ప్రాంతానికి సడలింపు ఇవ్వాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పార్టీ శ్రేణులతో కలిసి రామవరంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా గృహలక్ష్మి పథకానికి దరఖాస్తులు తీసుకొని ఇప్పుడు ఎంక్వయిరీ లా పేరుతో గృహలక్ష్మీ పథకం అర్హత సాధించాలంటే ఇంటి స్థలానికి రిజిస్టర్ పట్టా కావాలని నిబంధన విధించడం సరికాదని విమర్శించారు.ఈనిబంధన ద్వారా రామవరం ప్రాంత ప్రజలకి గృహలక్ష్మి పథకంలో ప్రభుత్వం తీరని అన్యాయం చేసినట్లు అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.36 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నపుడు 29వార్డులు మున్సిపల్ పరిధి,7వార్డులకు ఏజెన్సీ వర్తిస్తుందని ప్రశ్నించారు. రామవరం ప్రాంతం నుండే రెండు పర్యాయాలు ఛైర్ పర్సన్ గా ఎన్నికైన ఈ ప్రాంత ప్రజలకు యాజమాన్య హక్కులు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు.రామవరం ప్రాంతం 1/70 లో ఉందనడం సరైంది కాదన్నారు.గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి నిబంధన లేకుండా 1050 ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసినట్లు గుర్తుచేశారు.రామవరం ప్రాంతానికి గృహలక్ష్మి ఇళ్లను మంజూరు చేయాలని లేనియెడల ప్రజలను మమైకం చేసి ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సాయి,అల్లకొండ శరత్,అసెంబ్లీ చేరికల కమిటీ ఛైర్మన్ గుడివాడ రాజేందర్,మాలోత్ వీరు నాయక్,చెనిగారపు నిరంజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin