Thursday, 30 July 2026 08:20:12 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

జిపి కార్మికుల సమ్మెపై ప్రభుత్వ ఒత్తిడి, బెదిరింపులు మానుకోవాలి... -ఐ ఎఫ్ టి యు రాష్ట్ర సహాయ కార్యదర్శి గంట నాగయ్య

Date : 09 July 2023 07:48 AM Views : 243

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మోతే మండలం కేంద్రం లో జరుగుతున్న మూడవ రోజు సమ్మె కు మద్దతు తెలిపి గంట నాగయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో 12,769 గ్రామపంచాయతీలో పనిచేస్తున్న 60 వేల కార్మికులకు వేతనాలు పెంచి పర్మినెంట్ చేయాలని, ప్రమాద బీమా 10 లక్షలు కట్టాలని, కార్మికులందరికీ పిఎఫ్ ,ఈఎస్ఐ చట్టాలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలని రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, కారోబార్లకు పదోన్నతి కల్పించాలని, పంచాయతీ కార్మికులు పేదలు దళితులు కనుక వాళ్లకు ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్రూంలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆయన కోరారు. చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న మా కార్మికుల కన్నీటి ఘోష ప్రభుత్వానికి అర్థం కావట్లేదా? అని ప్రశ్నించారు. జీవో 51 రద్దుచేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన కోరారు. పెరుగుతున్న ధరలను దృష్టిలో పెట్టుకొని జెఎసి పెట్టిన డిమాండ్స్ ని పరిష్కరించాలని, ఎమ్మెల్యేలు కేసీఆర్ తో మాట్లాడి మా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఆయన కోరారు. ఐ ఎఫ్ టి యు జిల్లా ఉపాధ్యక్షులు కుణుకుంట్ల సైదులు జే ఏ సి నాయకులు రవిచంద్ర,జలగం తిరపయ్య, స్కై లాబ్,ఉపేందర్,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :