సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ గారి 285వ జయంతి సందర్భంగా తెలంగాణ లంబాడి హక్కుల పోరాట సమితి సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 15న హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉన్న బంజారా భవన్ లో ఘనంగా జయంతి ఉత్సవాలు నిర్వహించుచున్నాము హుజూర్ నగర్ ఆర్డిఓ కార్యాలయంలో ఆర్డిఓ జగదీశ్వర్ రెడ్డి చేతుల మీదుగా శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి పోస్టర్ ఆవిష్కరణ తెలంగాణ లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు మాలోతు నాగు నాయక్ ఆధ్వర్యంలో ఆవిష్కరణ చేశారు. ఈనెల 15న జరిగే సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి భోగ్ బండారో కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మరియు భారీ నీటిపారుదల శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి , గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీమతి ధనసరి సీతక్క , కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి సూర్యాపేట జిల్లాలో ఉన్న గిరిజన ప్రజా ప్రతినిధులు గిరిజన ఉద్యోగస్తులు నాయకులు మేధావులు ప్రజాసంఘ నాయకులు మహిళలు యువకులు కళాకారులు ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయగలరని మనవి. అందరూ ఆహ్వానితులే...
-----------------------
Admin