సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠం పల్లి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బిలియా నాయక్ తండ నందు జాతీయ క్రీడ దినోత్సవం పురస్కరించుకొని జరిగిన కార్యక్రమంలో మఠంపల్లి మండల జడ్పిటిసి జగన్ నాయక్ ముఖ్యఅతిథిగా పాల్గొని వారి సొంత ఖర్చులతో సుమారు పదివేల రూపాయల విలువగల క్రీడా దుస్తులను పాఠశాల విద్యార్థులకు అందించారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని ఈ సందర్భంగా కోరారు. విద్యార్థులు క్రీడా విన్యాసాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామిశెట్టి వేణుగోపాల్, బాడవ తండా ఉపసర్పంచ్ బాలు నాయక్, గ్రామ పెద్దలు శ్రీను,రాము,నాగేంద్ర ,పాఠశాల ఉపాధ్యాయులు బూర శారద,దేవన బోయిన నర్మద,కొప్పుల బ్రహ్మారెడ్డి వ్యాయామ ఉపాధ్యాయులు గుమిత ఉపేందర్ రెడ్డి మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
-----------------------
Admin