సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం రుద్రంపూర్ లో కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం... హుజురాబాద్ లో జి ఎస్ ఆర్ జర్నలిస్టు అజయ్ ముదిరాజుని అసభ్య పదజాలంతో తిడుతూ ముదిరాజు జాతిని అవమాన పరుస్తూ ముదిరాజ్ జాతిని అవహేళన చేసి, దాడి చేసిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రుద్రంపూర్ సెంటర్లో సోప్పరి తెలంగాణ క్రాంతి ఆధ్వర్యంలో శవయాత్ర నిర్వహించి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగినది, సోప్పరి తెలంగాణ క్రాంతి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసిఆర్, కేటీఆర్, వెంటనే కౌశిక్ రెడ్డిని బర్త్ రఫ్ చేసి , యావత్ బిసి, బహుజన, ముదిరాజ్, సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడం జరిగినది, లేనియెడల కౌశిక్ రెడ్డిని తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికక్కడ అడ్డుకొని తిరగనియ్యమని హెచ్చరించడం జరిగినది, ఈ యొక్క కార్యక్రమంలో బండారి నాగేశ్వరరావు, మామిడి రాజేశ్వరరావు, ఉడతల పరశురాములు, సారా మహేష్, పిట్టల రవి, ఉచిత లక్ష్మణ్, సోప్పరి సతీష్, బోల్ల బోయిన ఉమా మహేష్, గణపారపు ప్రవీణ్, ప్రశాంత్, బొల్ల ఎలేందర్, రామనబోయిన ప్రశాంత్, ఇట్టబోయిన శివకుమార్, కొలిపాక రాజేష్, కప్పల శేఖర్, నిమ్మల నరేష్, ముదిరాజ్ సోదరులు పాల్గొనడం జరిగింది.
-----------------------
Admin