సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి / ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీలలో అన్ని ఖాళీలను చూపాలి అని డిటిఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గౌస్ లాజమ్, సురేష్ బాబు శనివారం ఒక ప్రకటనలో కోరారు. హెచ్.ఆర్.ఏ ప్రాతిపదికన నాలుగు క్యాటగిరీలుగా విభజించారని, అందులో ఖాళీలను బ్లాక్ చేయవద్దని డిమాండ్ చేశారు. 10 శాతం ఖాళీలు బ్లాక్ చేయడంతో సుదీర్ఘకాలం దూరంగా ఉన్న పాఠశాలల్లో విధులు నిర్వర్తించిన ఉపాధ్యాయులు నష్టపోతారన్నారు. ఖాళీలను బాక్డ్ చేయకుండా బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. 2015 బదిలీ టీచర్లకు 8 ఏళ్లు పూర్తి కానందున ప్రస్తుత బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వడమో లేక స్టేషన్ పాయింట్ కి మిగతా ఆరు నెలల కాలానికి 2 పాయింట్లు కలిపి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
-----------------------
Admin