Thursday, 30 July 2026 11:22:08 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

షాద్ నగర్ మీడియా సమావేశంలో బిజెపి నేతల ఫైర్...

Date : 24 May 2023 06:08 AM Views : 497

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : మంగళవారం షాద్ నగర్ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర నాయకులు నెల్లీ శ్రీవర్ధన్ రెడ్డి, ఏపీ మిథున్ రెడ్డి, నియోజకవర్గ సీనియర్ నేతలు కమ్మరి భూపాల్ చారి దేపల్లి అశోక్ గౌడ్, పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, అందే బాబయ్య మాట్లాడుతూ.. 70 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి పాలమూరు జిల్లాకు నదీ జలాల వాటా విషయంలో తీవ్ర అన్యాయం చేస్తే ఆ తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంతో ముందుకు వచ్చిన కెసిఆర్ నీళ్లు నిధులు నియామకాలు అంటూ ప్రధానంగా నీళ్ల సమస్యపై న్యాయం చేస్తానని చెప్పి అధికారం చేపట్టారని గుర్తు చేశారు. 2009లో తెలంగాణ ఉద్యమ హోదాలో పాలమూరు జిల్లా ఎంపీగా కేసీఆర్ గెలుపొందారని ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రి కూడా అయ్యారని అన్నారు. ఈ జిల్లా ప్రజలు కేసీఆర్ ను గుండెల్లో పెట్టుకొని పార్లమెంటుకు పంపితేనే తెలంగాణ వచ్చిందన్న విషయం మరిచిపోయి ఈ జిల్లాకే తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా లక్ష్మీదేవి పల్లి ప్రాజెక్టుకు సంబంధించి 72 జీవోను ప్రభుత్వం విడుదల చేసిందని ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గంపై భగీరదుడిలా షాద్ నగర్ నెత్తిమీద కుండ పెడతానన్న ముఖ్యమంత్రి 9 ఏళ్లు దాటిన లక్ష్మీదేవి పల్లి వ్యవహారాన్ని ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. లక్ష్మీదేవి పల్లి నిర్లక్ష్యంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ను స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల తరఫున ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యే అంజయ్య ఒక్కరోజు కూడా లక్ష్మీదేవి పల్లి అంశంపై అసెంబ్లీలో చర్చించలేదని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలలో భాగంగా నార్లాపూర్, వట్టెం, ఏదుల, కరివేన, ఉదండాపూర్ అన్ని రిజర్వాయర్ల వద్ద వివాదాలే ఎదురయ్యాయని ఆ వివాదాలు సృష్టించిన ప్రజా ప్రతినిధులు అప్పుడు ఏ పార్టీలో ఉన్నారు? ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు? ప్రజలకు తెలుసని అన్నారు. జీవో 72 ప్రకారం జూరాల ద్వారా ఆరు జిల్లాలకు ఈ ప్రాజెక్టు వచ్చేదని కానీ ప్రభుత్వం కమిషన్ల అత్యాశకు పోయి రీడిజైన్ల పేరుతో పథకం స్వరూపమే మార్చేసిందని అన్నారు. లక్ష్మీదేవి పల్లి కేవలం ఓట్ల రాజకీయం కోసమే పనికి వస్తుందని ఆయన విమర్శించారు. 33% పరివాహక ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్ కు 512 టీఎంసీల నీరు కేటాయిస్తే, 66% పరివాహాక ప్రాంతం ఉన్న తెలంగాణకు 292 టీఎంసీల నీరు కేటాయించడం పై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు ప్రశ్నించడం లేదని? అన్నారు. తెలంగాణ వచ్చాక అపెక్స్ బాడీలో కెసిఆర్ ఎందుకు ఒప్పుకున్నారని నిలదీశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి దర్జాగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీళ్లు రాయలసీమకు తరలించకపోతే కేసిఆర్ ప్రశ్నించిన పాపాన పోలేదని అన్నారు. తెలంగాణకు ఇంత అన్యాయం జరుగుతుంటే కెసిఆర్ ఎందుకు నోరు మెదపడం లేదని అన్నారు. రోజా ఇంట చేపల పులుసు తిని ఆంధ్రను సస్యశ్యామలం చేస్తానన్న కేసీఆర్ మాటలను తెలంగాణ ప్రజలు ఇంకా మరిచిపోలేదని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మహబూబ్ నగర్ జిల్లాలో 44 లక్షల మంది ఉంటే అందులో 14 లక్షల మంది వలసలకు కారణం ఎవరని? వారు ప్రశ్నించారు. పాలమూరు ప్రజలు కేసీఆర్ ను గెలిపిస్తే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నిర్వీర్యం చేసి ఆగమేఘాల మీద కాలేశ్వరం ప్రాజెక్టును ముందుకు తీసుకొచ్చి లక్షల కోట్ల రూపాయలు ధారపోసి ఈ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? అని వారు ప్రశ్నించారు. లక్ష్మీదేవి పల్లి సమస్యపై భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున కార్యచరణ ప్రణాళిక రూపొందిస్తుందని త్వరలోనే దీనిపై పెద్ద ఎత్తున పోరాడుతుందని అన్నారు. జాతీయ హోదా అంశంలో ప్రభుత్వం సాగునీటికి బదులు తాగునీటికి సంబంధించి డిపిఆర్ ఇస్తే 900 కోట్ల రూపాయల జరిమానా కట్టాలన్న అంశం గురించి ప్రజలకు తెలియదా? అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. సరైన వివరాలు సమర్పించలేని చేతకాని ప్రభుత్వం ఇదని వారు అన్నారు. ఎలాంటి తెలివి లేని ప్రభుత్వానికి అడిగే పద్ధతులు తెలవనప్పుడు జాతీయ హోదా ఎలా? లభిస్తుందని అన్నారు. నివేదిక ఇవ్వకపోతే హోదాలు ఎలా దక్కుతాయని బిజెపి నేతలు ప్రశ్నించారు. లక్ష్మీదేవి పల్లి ప్రాజెక్టు నిర్మించకపోతే టిఆర్ఎస్ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో గోరి కడతామని అన్నారు. ఎన్నికలలోపు నిర్మిస్తారన్న గ్యారెంటీ లేదని స్పష్టం చేశారు. మొదటి నుండి ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటి రంగం విషయంలో కొంతమంది ప్రజాప్రతినిధులు కేసులు వేసిన సాక్షాదారాలు తమ వద్ద ఉన్నాయని, వారు అప్పుడు ఏ పార్టీలో ఉన్నారు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో సాక్షాదారులతో సహా నిరూపిస్తామని అన్నారు. పాలమూరు ప్రాజెక్టుల విషయంలో అహంకార పూరిత ధోరణితో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తున్నారని వీరుచుకుపడ్డారు. ప్రాజెక్టుల అంశంలో భారతీయ జనతా పార్టీకి చిత్తశద్ధి ఉందన్నారు. ఎమ్మెల్యే అంజయ్యకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే ముఖ్యమంత్రికి లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ ఏర్పాటు గురించి ఇక్కడ ప్రజల డిమాండ్ ను తెలియజేయాలని సవాల్ విసిరారు. ఈ విలేకరుల సమావేశంలో బిజెపి నాయకులు మల్చాల మురళి, మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు..

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: