సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : నర్సంపేట మండలం గురజాల గ్రామానికి చెందిన ఆర్టీసీ ఉద్యోగి గొలనుకొండ వేణు గత కొన్ని సంవత్సరాల నుండి చేస్తున్న సామజిక సేవలను గుర్తించి గౌరవ డాక్టరెట్ పురస్కారాన్ని మన తెలుగు సాంస్కృతి సాహితి సేవా ట్రస్ట్ వారు ఈ రోజు అనగా ఆదివారం నాడు హైదరాబాద్ భాగ్ లింగంపల్లిలో గల సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మన సినీ నటుడు డాక్టర్ బాబు మోహన్ చేతులమీదుగా మన నర్సంపేట డిపో కండక్టర్ గోలనకొండ వేణు కి అందజేయడం జరిగింది ఈ సందర్భంగా దుగ్గొండి మండల ఎంఆర్పిఎఫ్ మండలాధ్యక్షుడు మరియు సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ మండల అధ్యక్షుడు అమరేందర్ కృతజ్ఞత తో కూడిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది
-----------------------
Reporter