Thursday, 30 July 2026 03:35:09 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..!

Date : 08 December 2025 10:11 AM Views : 425

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగుడెం జిల్లా దమ్మపేట మండలంలో పంచాయతీ ఎన్నికల సమయంలో జరిగిన పూజలు.. భయాందోళనకు దారితీశాయి.. మండలంలోని కొమ్ముగూడెం గ్రామంలో ఓ మాజీ సర్పంచ్ పగలు రాజకీయ నాయకుడిగా చెలామణి అవుతూ రాత్రి సమయంలో క్షుద్రపూజలు చేస్తున్నట్టు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.మారుమూల గిరిజన గ్రామంలో క్షుద్రపూజల కలకలం రేపింది. భద్రాద్రి కొత్తగుడెం జిల్లా దమ్మపేట మండలంలో పంచాయతీ ఎన్నికల సమయంలో జరిగిన పూజలు.. భయాందోళనకు దారితీశాయి.. మండలంలోని కొమ్ముగూడెం గ్రామంలో ఓ మాజీ సర్పంచ్ పగలు రాజకీయ నాయకుడిగా చెలామణి అవుతూ రాత్రి సమయంలో క్షుద్రపూజలు చేస్తున్నట్టు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అమాయక గిరిజనుల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకోవడానికి, అలాగే భయపెట్టడానికి నారపోగు నాగరాజు అనే మాజీ సర్పంచ్ తాంత్రిక పూజలు చేస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నాడని గ్రామస్తులు చెబుతున్నారు. తాంత్రిక విద్యలతో గాలిలో నిమ్మకాయలు నిలబెడుతూ అమాయక గిరిజనులని మభ్యపెట్టడమే కాకుండా ఓ క్షుద్ర మంత్రికుడిని తీసుకొచ్చి పూజలు చేస్తున్నట్టు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అన్నం రాసులపై జంతువుల మాంసం పెట్టి రక్త తర్పణాలు చేసి క్షుద్ర శక్తులను ఆధీనంలోకి తీసుకునేందుకు మాంత్రికుడితో పూజలు చేయిస్తున్నట్టు తెలియడంతో గ్రామస్తులు మరింత భయాందోళనలో ఉన్నారు. నాగరాజు గతంలో కూడా ఫేక్ పాస్ పుస్తకాల కేసులో జైలు శిక్ష అనుభవించి వచ్చాడని.. క్రిమినల్ మెంటాలిటీ కలిగిన ఇతను డబ్బే ప్రధాన ధ్యేయంగా క్షుద్ర పూజలు, తాంత్రిక విద్యలు అంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని పలువురు పేర్కొంటున్నారు. ఈ టెక్నాలజీ యుగంలో కూడా మూఢ నమ్మకాల పేరుతో అమాయక ప్రజలను మభ్యపెట్టి క్షుద్ర పూజలు చేస్తూ గ్రామస్తులను భయబ్రాంతులకు గురి చేస్తున్న మాజీ సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: