సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : కేశంపేట్ మండల్ : కర్నాటక ఎన్నికల్లో విజయం తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై పూర్తి ఫోకస్ పెట్టిందని భారతీయ జనతా పార్టీని నిలువరించామని ఇక బిఆర్ఎస్ సంగతి చూస్తామని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ అన్నారు. కేశంపేట మండలంలోని ఇప్పలపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరైన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్.. కేశంపేట్ మండల పార్టీ అధ్యక్షుడు వీరేశం ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ.. ఇటీవల తెలంగాణలో ప్రియాంక గాంధీ తొలి సభలో యూత్ డిక్లరేషన్ ప్రకటించగా, ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ ప్రకటించారని ఇక కొల్లాపూర్ సభలో మహిళా డిక్లరేషన్ ప్రకటించబోతున్నారని అన్నారు. మహిళా డిక్లరేషన్.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కూడా విడివిడిగా డిక్లరేషన్లు భవిష్యత్తులో ప్రకటిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యాదయ్య యాదవ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగదీష్ అప్ప, బాబర్ ఖాన్, కేశంపేట్ మాజీ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి, ఇప్పలపల్లి శ్రీనాథ్ గిరి యాదవ్, తుమ్మల గోపాల్, మాజీ డిప్యూటీ సర్పంచ్ యాదయ్య, యూత్ కాంగ్రెస్ అందేమోహన్, ముబారక్, ఖదీర్, పెంటయ్య, మాజీ సర్పంచ్ యాదగిరి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎల్లారెడ్డి, నందిగామ ఎంపిటిసి కొమ్ము కృష్ణ, కృపాకుల శేఖర్, నెహ్రూ నాయక్, చంద్రయ్య, భాస్కర్, శీను నాయక్, కిషన్ నాయక్, పీరియా నాయక్, రామ్ రెడ్డి మహిళా అధ్యక్షురాలు అనసూయమ్మ, శీను, ప్రకాష్ గౌడ్, విజయ రెడ్డి, శ్రీధర్, పసుల బుచ్చయ్య, మండల నాయకులు, కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
-----------------------
Admin