సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ప్రగతి గ్రామీణ బ్యాంక్ లో డబ్బులు స్వాహా చేసిన గత మేనేజర్ నుంచి రికవరీ చేయాలి... -జి ఆర్ సి పి డిమాండ్. శ్రీ సత్య సాయి జిల్లా అమడగూరు మండలంలోనీ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ లో డబ్బులు స్వాహా చేసిన గత మేనేజర్ నుంచి రికవరీ చేయాలని గ్రేట్ రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మున్నా డిమాండ్ చేశారు. అలా కాకుండా రైతులకు నోటీసులు ఇవ్వడం, రైతులకు ఒత్తడి చేయడం, రైతులను ఇబ్బంది పెడితే గ్రేట్ రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రైతుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం గ్రేట్ రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నుండి డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో డ్రైవర్ నూర్, షారుక్, రామచంద్ర, కాజా, తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin