Wednesday, 29 July 2026 05:38:13 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కేంద్ర ప్రభుత్వం ప్ర‌తిప‌క్షాల‌పై కేసుల దాడి... ప్ర‌జ‌ల‌పై ధ‌ర‌ల దాడి...

Date : 11 March 2023 12:12 AM Views : 516

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం, లక్ష్మీపురం గ్రామంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మండల బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ... ప్ర‌తిప‌క్షాల‌పై కేసుల దాడి.. ప్ర‌జ‌ల‌పై ధ‌ర‌ల దాడి..ఇవి తప్ప కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సాధించింది ఏమీ లేదు అని తెలిపారు.. కేసీఆర్ నాయ‌క‌త్వంలో దేశంలో బీఆర్ఎస్ పురోగ‌మిస్తున్న విధానం.... దేశంలో మిగిలిన ఏ రాష్ట్రాలలో లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధితో.. సంక్షేమ పథకాలతో.. కెసిఆర్, బీఆర్ఎస్...ఒక అజేయ‌మైన శ‌క్తిగా ఎదగడం సహించలేని నరేంద్ర మోడీ.. ఇక ప్రజాక్షేత్రంలో కెసిఆర్ తో తలపడలేమని దొంగ నాటకాలకు తేరలేపాడు.. కెసిఆర్ ని డైరెక్ట్ గా ఎదుర్కొనే దమ్ము లేక తన జేబుసంస్థ ఈడి ద్వారా ఎమ్మెల్సీ క‌వితకు స‌మ‌న్లు పంపాడు.ఇవి ఈడీ స‌మ‌న్లు కాదు.. క‌చ్చితంగా మోదీ స‌మ‌న్లు. ఇది రాజ‌కీయంగా చేసే చిల్ల‌ర ప్ర‌య‌త్నం. సీబీఐ, ఈడీ, ఐటీ కేంద్రం చేతుల్లో కీలుబొమ్మ‌లు. అదానీ లాంటి బినామీలను అడ్డుపెట్టుకొని సంపాదించిన అడ్డ‌మైన దొంగ సొమ్ముతో ప్ర‌జ‌ల ప‌క్షాన నిల‌బ‌డ్డ పార్టీల‌ను చీల్చి, లొంగ‌ని వారిపై ఈడీ, సీబీఐ దాడులు చేయించడమే పనిగా పెట్టుకుంది కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం... ఇలాంటి పిట్ట బెదిరింపులకు తెలంగాణ సమాజం తలవంచదు.. భయపడదు... ఖబడ్దార్ నరేంద్ర మోడీ.. ఇప్పటికైనా ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను.. ప్రజా ప్రభుత్వాలను కూల్చడానికి,స్వార్ధ ప్రయోజనాలకు వాడితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది... అని తెలిపారు.. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత, ఏఎంసి చైర్మన్ పోడియం ముత్యాలమ్మ, సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి, బీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్ ,బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పోడియం నరేంద్ర తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :