సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : ప్రజా సమస్యలపై ప్రభుత్వాలను ప్రశ్నించే వారికే పట్టం కట్టాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ అన్నారు.ఆదివారం బూడిదగడ్డ బస్తీ 2వ వార్డులో పర్యటించి ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నిస్వార్థంగా,నిజాయితీగా,నిబద్ధతతో,పనిచేసే స్థానికుడిని ఎన్నికల్లో ఎన్నుకోవాలి కోరారు.యువత రాజకీయాల్లోకి రావాలని డెభై ఐదు ఎండ్ల స్వాత్రంత్ర దేశంలో అవినీతి పేరుకుపోయిందని దాన్ని అంతమొందిచాలని అక్రమార్కులు,అవినీతి పరులు అడ్డదారిలో సంపాదించిన సొమ్ముతో రాజకీయాల్లోకి వచ్చి వ్యవస్థలను బ్రష్టు పట్టిస్తున్నారని,ఎన్నికలకు ఆర్నెల్ల ముందు డబ్బు సంచులతో ఊర్లలో మకాం వేసి ఓట్లకు డబ్బు పంపిణీ చేసి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని అటువంటి వారికి ఓటు ద్వారా బుద్ధి చెప్పాలన్నారు.జిల్లా కేంద్రంలో తీవ్రమైన మంచినీటి ఎద్దడి ఉందని దాన్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున్ రావు,అసెంబ్లీ అధ్యక్షుడు నాగుల రవికుమార్,వంగా రవిశంకర్,పోలే కనకరాజు,మాలోత్ పూర్ణ తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin