Wednesday, 29 July 2026 03:58:39 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి నిర్మల్‌ జిల్లా లో పాలాభిషేకం...

Date : 07 October 2022 03:26 PM Views : 457

సర్కార్ టీవీ న్యూస్ / నిర్మల్ జిల్లా : టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా ప్రకటించి జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి నిర్మల్‌ జిల్లా లో రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాలాభిషేకం చేశారు. ఇవాళ నిర్మల్‌ జిల్లా నర్సాపూర్‌(జీ) మండలానికి చెందిన కాంగ్రెస్‌ నాయకులు బి. గంగాధర్, బి. సుబ్బయ్య, సాజిద్ ఖాన్, రొడ్డ ప్రవీణ్ , రొడ్డ రాజేందర్, బి. సురేశ్‌ తో పాటు 150 మంది టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ జాతీయ పార్టీ ప్రకటనతో ఆయా రాష్ట్రాల ముఖ్య నేతలు, ప్రజలు సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ కు ఉన్న ప్రజాదారణ,రాష్ట్ర అభివృద్ధి చూసి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు టీఆర్ఎస్ లో చేరుతున్నారని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తుందని విమర్శించారు . అధానీ, అంబానీల కంపనీలకు కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేస్తూ బడాబాబుల కొమ్ము కాస్తుందని ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గులాబీ జెండా ఎగురడం ఖాయమని అన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :