సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : వేంసూరు మండలంలోని ఎర సా నివారి బంజర లో చేతికొచ్చిన వరి పంట తో రైతుల్లో ఆనందం వెల్లి విరిసింది. వేంసూరు మండలంలో 25 వేల ఎకరాలలో రైతన్నలు కోరి పంటను పండిస్తున్నారు. లంక సాగర్ ప్రాజెక్టు ద్వారా విడుదల అవుతున్న జలాలతో, మరియు నాగార్జునసాగర్ జలాలతో ఆయకట్టు రైతాంగం వేలాది ఎకరాలలో రెండు పంటలను పండిస్తున్నారు. రైతే రాజు, రైతు దేశానికి వెన్నుముక అన్న నానుడిని నిజం చేసేందుకు గాను ప్ర తి ఏటా కష్టపడి శ్రమించి రైతాంగం దుక్కులు దున్నుకొని, వరి నార్లు చల్లుకొని, కలుపు నివారణ మందులను చల్లుకొని రైతులు వరి పంటను పండిస్తున్నారు. మండలంలో కొన్నిచోట్ల వరి పంట పొట్ట దశకు చేరుకోవడం, మరికొన్నిచోట్ల వరి కంకులు వస్తుండటంతో రైతుల కృషి ఫలితం అని చెప్పవచ్చు. ఏది ఏమైనా వరి పంట చేతికి రావడంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
-----------------------
Admin