Sunday, 07 June 2026 09:11:56 AM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

మునుగోడు ఉపఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డికి గుణపాఠం చెప్పాలి.....

Date : 09 October 2022 11:12 PM Views : 442

సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : నాంపల్లి మండలం రెఖ్య తండా,వస్రం తాండలకు చెందిన వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రవకుమార్, -బిజెపి కి ఓటు వేస్తే మోటర్లకు మీటర్లు తప్పవు. -వంటగ్యాస్ తో సహా డీజిల్,పెట్రోల్ ధరలు పెరుగుతాయి. -సంక్షేమం, అభివృద్ధి టిఆర్ఎస్ తోటే సాధ్యం. -టిఆర్ఎస్ లోకి కొనసాగుతున్న వలసల జాతర. -ప్రభాకర్ రెడ్డికే పట్టం కట్టాలి. -టీఆర్ఎస్ అభ్యర్థి వైపే మునుగోడు నియోజకవర్గ ప్రజల చూపు . -ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని. మునుగోడు ఉపఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డికి మునుగోడు ప్రజలు గుణపాఠం చెప్పాలి అని టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్రవకుమార్ అన్నారు.ఆదివారం నాంపల్లి మండలం రెఖ్య తండాకు,వస్త్రం తండాకు చెందిన 30మంది ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....బిజెపి కి ఓటేస్తే మోటర్లకు మీటర్లు రావడమే కాకుండా అత్యంత దారుణంగా మోదీ సర్కార్ రూపొందించిన విద్యుత్ సంస్కరణలు, వ్యవసాయ చట్టాలు వస్తాయని హెచ్చరించారు. అవే చట్టాలు అంటూ అమలులోకి వస్తే వ్యవసాయదారులకు గుదిబండలుగా మరాయన్నారు.అంతటితో ఆగకుండా ఇప్పటికే పెరిగిన డీజిల్,పెట్రోల్, వంటగ్యాస్ ధరలతో కుదేలవుతున్న సామాన్యుడి మీద పెనుభారం మోపేందుకు బిజెపి సర్కార్ ప్రణాళికలు రూపొందించిందాన్నారు.సంక్షేమం, అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తో మాత్రమే సాధ్యాపడుతుందన్నారు.అవే పధకాలు దేశవ్యాప్తంగా విస్తరింప చెయ్యాలి అన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమన్నారు.అది మునుగోడు ప్రజల భాగస్వామ్యం తోటే ప్రారంభం కావాలన్నారు.మునుగోడులో ఎగిరేది గులాబీ జెండానే అని ఆయన అన్నారు.బిజెపి చిల్లర రాజకీయాలు చేస్తుంది,ప్రజలు గమనిస్తున్నారు అని ఆయన తెలిపారు.మునుగోడు ఉపఎన్నిక ప్రజల అవసరం కోసం వచ్చిన ఎన్నిక కాదు అని అన్నారు.మునుగోడు ఎన్నిక రాజగోపాల్ రెడ్డి సొంత ప్రయోజనం కోసం వచ్చింది అని ఆయన తెలిపారు.18000 వేలకోట్ల కాంట్రాక్టులు తీసుకున్న అని రాజగోపాల్ రెడ్డినే ఒప్పుకున్నాడు అని ఆయన తెలిపారు.రాజగోపాల్ రెడ్డి తన ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని అమ్ముకున్నాడు అని ఆయన అన్నారు.రాజగోపాల్ రెడ్డి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడు అని ఆయన అన్నారు.కేసీఆర్ గారికి జాతీయస్థాయిలో వస్తున్న ఆదరణ చూసి కుట్రతో తెచ్చిన ఎన్నిక మునుగోడు అని ఆయన తెలిపారు.మునుగోడు అభివృద్ధి కోసం రాజగోపాల్ రెడ్డి ఏ ఒక్క రోజు ప్రయత్నం చేయలేదు అని ఆయన అన్నారు.దేశం చూపు తెలంగాణ వైపు ఉన్నది అని ఆయన అన్నారు.కేంద్ర ప్రభుత్వం ప్రతి విషయంలో విఫలమైంది అని ఆయన చెప్పారు.కేసిఆర్ గారిని అవహేళన చేసిన వారంతా నేడు చీకట్లో కలిసి పోయారు అని ఆయన అన్నారు.టీఆర్ఎస్ అభ్యర్థి వైపే మునుగోడు నియోజకవర్గ ప్రజల చూపు అని ఆయన అన్నారు.టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శంకర్,కృష్ణ తదితరులు పాల్గొన్నారు, పార్టీలో చేరిన వారిలో బాధ్య నాయక్,లక్ష్మణ్,హరిలాల్,లచ్యు, రవి,మధు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :