సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీని నాబార్డ్ నిధులతో కాలేజీ బిల్డింగ్ నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతున్నది. అయితే కాంట్రాక్టర్ ఈ బిల్డింగ్ నిర్మాణం చాలా నాసిరకంగా పనులు చేపట్టడం జరుగుతున్నది, వీటిపై క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ వారు వచ్చి ఈ బిల్డింగ్ నిర్మాణ పనులను పరిశీలించాలని .పుట్టపర్తి ఆర్డీవో భాగ్యరేఖ తో జి ఆర్ సి పి నాయకులు చర్చించడం జరిగింది , ఈ విషయమై పుట్టపర్తి ఆర్డీవో భాగ్యరేఖ స్పందించి వెంటనే జిల్లా పరిషత్ సీఈవో ఈ బిల్డింగ్ పనులపై పరిశీలించాలని ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మున్నా, రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి రామచంద్ర, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin