సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచ : క్రిస్టియన్ మైనార్టీ సంస్థలు సమాజంలో శాంతి స్థాపనకు కృషి చేయడం అభినందనీయమని, సమాజహితం కోసం వారు చేస్తున్న కృషికి తనవంతు సహకారాన్ని అందిస్తానని కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆదివారం బెరాక చర్చ్ నందు ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్న కూనంనేని మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించినందుకు కృతజ్ఞుణ్ణి ఉంటానని, ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాను అన్నారు. తాను ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలోని నియూజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని, గతం కంటే మరింత అభివృద్ధి చేసేందుకు, ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో నిధులు రాబట్టేందుకు ఇప్పటికే ప్రణాళిక రూపొందించామని అన్నారు. నియోజవర్గంలో మరింత అభివృద్ధి సాదించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని స్పష్టం చేశారు. ప్రతి గ్రామానికి, వార్డుకు కనీస మౌలిక వసతులు కల్పించడంతోపాటు, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి అందించేందుకు చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాష, పట్టణ కార్యదర్శి అడుసుమిల్లి సాయిబాబు, మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్రరావు, జిల్లా సమితి సభ్యులు దుగ్గిరాల సుధాకర్, గుండాల నాగరాజు, నాయకులు అన్నారపు వెంకటేశ్వర్లు, శనగరపు శ్రీనివాస్ రావు, ఇట్టి వెంకట్రరావు, గిరి, జకరయ్య, పాషా, బెరాక చర్చ్ సభ్యులు బ్రదర్ ఐజాక్, మోజేష్ చారి, నాగేశ్వరరావు, సుగుణరావు, ప్రసాదరావు, స్వామిదాస్, జాకబ్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin