సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు మండల లో పక్షుల ప్రేమికులు గౌస్ లాజమ్ మాట్లాడుతూ.ప్రస్తుతం విచ్చలవిడిగా అడవుల తగలబెట్టడం చెట్లు నరికి వేయడంతో పాటు రేడియేషన్ వల వలలో చిక్కిన జీవజాలం అంతరించిపోతుంది. కొన్ని పక్షి జాతులు కూడా నష్టపోతున్నాయి ఉన్న పక్షి జాతులైన కాపాడుకోవాలని పక్షుల ప్రేమికులు పరితపిస్తున్నారు.అలాంటివారిలో ఓబులుదేవరచెరువు మండలంలోని కమ్మవారి పల్లి ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు గౌస్ లాజమ్ ఒకరు. అసలే ఎండాకాలంలో సూర్యుడి తాపానికి మనుషులే కాదు, పక్షులు కూడా తిండి నీరు కోసం ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన ఆయన గత ఆరు ఏళ్ళుగా పక్షుల సంరక్షణ కోసం వినూత్న రీతిలో ప్రయోగాలు చేస్తున్నారు. గతంలో వాటర్ బాటిల్ తో పక్షులు తాగడానికి చెట్లు కొమ్మలకు వాటర్ బాటిల్ వేలాడదీశారు. మరోసారి ఐదు లీటర్ల ఆయిల్ డబ్బా కు నాలుగు పక్కల వాటికి డోర్లు ఏర్పాటు చేసి డోర్ల పై భాగాన తిండి గింజలు ఏర్పాటు చేసి మధ్య భాగంలో నీటి సౌకర్యం కల్పించారు వాటిని చెట్ల కొమ్మలకు, ఇంటి ఆవరణంలో వేలాడదీశారు. ఈసారి కూడా వాటర్ బాటిల్, డబ్బాలతో పాటు పక్షి గూడు ఆకారంలో ఉన్నటువంటి వాటిని ఇంటి ఆవరణంలో వేలాడదీశారు. ఎండాకాలంలో ఆరుబయట గోడల పైన పక్షులకు పిట్టలకు జంతువులకు నీళ్లు పెట్టి వాటి ప్రాణం కాపాడండి.ఎండాకాలంలో పక్షుల కోసం గిన్నెలు, మూకుళ్లలో తాగునీరు పెడదాం. నీటి వనరులు ఎండిపోయే వేళ వాటికి కొన్ని నీళ్లు ఏర్పాటు చేయగలిగితే ప్రాణాలు నిలబెట్టిన వాళ్లమవుతాం. వేసవిలో వాటికీ సాయం చేద్దాం. మనతో పాటు సృష్టిలో జీవించే హక్కు వాటికీ ఉంది కదా.పక్షజాతులంతరించిపోకుండా సంరక్షణ కోసం ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు...
-----------------------
Admin