సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుళ దేవర చెరువు మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో కొండకమర్ల సర్పంచ్ అల్లాపల్లి శ్రావణి ఆధ్వర్యంలో గర్భిణీలకు, బాలింతలకు అన్నధాన కార్యక్రమం నిర్వహించినట్లు డాక్టర్ బానుప్రకాష్ నాయక్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ప్రతినెల గర్భిణీలకు నిర్వహించే ఆరోగ్య పరీక్షలలో భాగంగా వైద్య పరీక్షల అనంతరం పస్తులు వెళ్లకుండా దాతల సహారంతో అన్నదానం చేయడం హర్షించందగ్గ విషయమని కొనియాడుతూ దాతలను అభినందించారు. వీరిని ఆదర్శనంగా తీసుకుని దాతలు ముందుకు వచ్చి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సర్పంచ్ శ్రావణి మాట్లాడుతూ ఆకలితో వున్న అన్నార్థుల ఆకలి తీర్చడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్లు, హెల్త్ సిబ్బంది, ఆశాలు తదితరులు పాల్గొన్నారు.....
-----------------------
Admin