సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : హనుమకొండ, రాఘవేంద్ర కన్వెన్షన్ లో తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రైవేట్ టీచర్స్ ఫెలిసిటేషన్ కార్యక్రమానికి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్.చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం టీచర్ లతో కలిసి ఎంపీ బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి మహోన్నతమైనది అని అన్నారు. విద్యార్థులను అత్యుత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ప్రైవేట్ టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఉపాధ్యాయుల సంక్షేమానికి రాజీ పడకుండా పని చేస్తానన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు తమ వ్యక్తిగత విజయానికి కాకుండా విద్యార్థుల, సమాజ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ప్రైవేట్ టీచర్లు ఏకమై సంస్థగా తమ హక్కుల కోసం పోరాడాలన్నారు.ఈ కార్యక్రమంలో కడియం రామచంద్రయ్య, INTUC కూర వెంకట్, TGSPTU ఫౌండర్ ముజీబ్ ఖాన్, ప్రెసిడెంట్ ఫర్జానా తాసీమ్, టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin