Wednesday, 29 July 2026 10:00:45 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గంజాయి స్మగ్లర్లు భద్రాచలం ఎక్సైజ్ కానిస్టేబుల్‌పై దాడి...

Date : 28 October 2022 10:29 AM Views : 343

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపహాడ్‌ మండలంలో గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోయారు. బూర్గంపహాడ్‌ మండలంలోని లక్ష్మిపురం వద్ద గంజాయి తరలిస్తున్న కారును అడ్డుకోవడంతో ఎక్సైజ్‌ అధికారిపై దుండగులు దాడికి పాల్పడ్డారు. కానిస్టేబుల్‌ ప్రతిఘటించడంతో కారును అక్కడే వదిలి పరారయ్యారు. గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో భద్రాచలం ఫారెస్ట్‌ చెక్‌పోస్ట్‌ వద్ద ఎక్సైజ్‌ పోలీసులు శుక్రవారం ఉదయం వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో వేగంగా దూసుకొచ్చిన ఓ కారు చెక్‌పోస్టు వద్ద ఆగకుండా వెళ్లిపోయింది. కారును వెంబడించిన ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సలీం లక్ష్మీపురం వద్ద వారిని అడ్డుకున్నారు. రోడ్డుకు అడ్డంగా కారు పెట్టడంతో స్మగ్లర్లు అతడిపై దాడి చేశారు. అనంతరం గంజాయితోపాటు తమ కారును అక్కడే వదిలి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్మగ్లర్ల కోసం గాలింపు ప్రారంభించారు. అయితే గంజాయి ఎంతమొత్తంలో ఉందనే విషయం ఇంకా తెలియాల్సి ఉన్నది.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :