Monday, 14 September 2026 03:06:20 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

దేశంలోనే గొప్ప ప్రజాస్వామ్య వాది సీఎం జగన్....

Date : 30 October 2022 11:05 PM Views : 562

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : *గ్రామ సచివాలయ వ్యవస్థ, వలంటీర్ల పనితీరు అద్భుతంగా నడుస్తోంది. *లక్షల కోట్ల రూపాయలు నేరుగా ప్రజల ఖాతాల్లో జమ అవుతున్నాయి. *చంద్రబాబు పాలనలో పారదర్శకంగా ఒక్క పథకమైన అమలు చేశారా..? *జన్మభూమి కమిటీలు చెప్పిన వారికే పథకాలు అందేవి. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ. * తన మూడేళ్ళ పాలనలో గ్రామ సచివాలయ, వలంటీర్లు వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాల అమలు నేరుగా ప్రజలకు లబ్ది చేకూర్చి దేశంలోని గొప్ప ప్రజాస్వామ్య వాదిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిబడ్డారని మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి చెప్పారు. వజ్రకరూరు మండలం తట్రకల్లు గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. *ఈ సందర్భంగా ప్రతి గడపకూ వెళ్లిన ఆయన ప్రజా సమస్యలు ఆరా తీయడంతో పాటు ప్రభుత్వం నుండి అందుతున్న సంక్షేమ పథకాలు, జరుగుతున్న అభివృద్ధిని ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. మరింత మెరుగైన పాలన సాగించేందుకు, ప్రజా సనస్యలును తెలుసుకుని వాటి సత్వర పరిష్కారానికి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపకుండా, చెప్పిన సమయానికి ముందుగానే సంక్షేమ ఫలాలను అందిస్తున్నారన్నారు.అర్హతే ప్రామాణికంగా, పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలను సీఎం జగన్ అందిస్తున్నారన్నారు.ఆదర్శంగా, పారదర్శకంగా పాలన కొనసాగుతోందన్నారు. పేదలు, మహిళలు, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు పెద్దపీట వేయడం జరుగుతోందన్నారు. గత చంద్రబాబు పాలనలో ఏ ఒక్క పథకమైనా పారదర్శకంగా అమలు చేసారా అని విశ్వేశ్వరరెడ్డి ప్రశ్నించారు. గతంలో ఏ పని కావాలన్నా జన్మభూమి కమిటీల మాఫియా సంతకాలు, లంచాలు కావాలని అడిగే వారని కానీ ఇవాళ ఎవరి ప్రమేయం, సిఫార్సు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ, గత ఎన్నికల్లో మాకు ఓటు వేయని వారైనా సరే ఇంటి తలుపు తట్టి ప్రభుత్వ పథకాలను సంతృప్త స్థాయిలో అందిస్తున్నామని తెలిపారు. మీ కళ్ల ముందే గ్రామ సచివాలయాల ద్వారా గడువు విధించి మరీ 540 రకాల సేవలు అందిస్తున్నామన్నారు.ఒకటో తారీఖునే పండగైనా, ఆదివారం అయినా సరే తెల్లవారుజామునే ఇంటికి వెళ్లి అవ్వాతాతలకు వలంటీర్లు చిరునవ్వుతో పెన్షన్‌ ఇస్తున్నామన్నారు. నేడు సీఎం జగన్ అద్భుతమైన పాలన జగన్ పాలనలో గ్రామాలకు గ్రామాలు ఆయన వైపు నిలుస్తున్నాయన్నారు. *ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు హనుమంత రెడ్డి, సీపీ వీరన్న, ఎంపిపి రమావత్ దేవి,వైస్ ఎంపీపీ సుశీలరాణి, ఎంపీటీసీ రామకృష్ణ,సర్పంచ్ లు మొనలిసా, శివాజి నాయక్,శ్రీనివాస్ రెడ్డి, నాయకులు ఉస్మాన్, గోవిందు,తహశీల్దార్ అనిల్ కుమార్, అధికారులు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు, వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: