Friday, 31 July 2026 12:26:18 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఈశ్వరాచారి ఆత్మాహుతికి మోడీ, రేవంత్ ప్రభుత్వాలే బాధ్యత వహించాలి చింతకింది కుమారస్వామి.

Date : 06 December 2025 01:45 PM Views : 264

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : అడగకున్నా అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ పేరుతో 10% రిజర్వేషన్లు ఇచ్చిన మోడీ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుండా ద్రోహం చేసిన కారణంగానే ఈశ్వర చారి ఆత్మహూతీ చేసుకోవడం జరిగిందనీ కుమారస్వామి అన్నారు. మండల కేంద్రమైన నల్లబెల్లి అంబేద్కర్ సెంటర్లో ఆత్మాహుతి చేసుకున్న ఈశ్వర చారి చిత్రపటానికి తెలంగాణ దళిత విద్యా వంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు బట్టు సాంబయ్య, అణగారిన వర్గాల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు పరికి కోర్నేలు, బీసీ హక్కుల సాధన సమితి మండల నాయకులు కడియాల క్రాంతి కుమార్,మాటూరి హారీష్ ,బత్తిని ఓదేలుతో కలిసి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ, అధికారంలోకి వస్తే జనాభా లెక్కలతో పాటు కులగణన చేసి బీసీల వాటా బీసీలకు ఇస్తామనీ 2014 ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి కేంద్రంలో బీసీల ఓట్లతో అధికారంలోకీ మోడీ బీజేపీ ప్రభుత్వం, గడిచిన పదకొండు ఏండ్ల నుంచి బీసీలకు విద్యా ఉద్యోగ ఉపాధి, చట్టసభలో, బడ్జెట్లో,రిజర్వేషన్లు ఇవ్వకపోగా , కనీసం బీసీలకు సంక్షేమ మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటు చేయకుండా బీసీలకు ద్రోహం చేయడమే కాకుండా, అగ్రకులాల పేదల పేరుతో ఈడబ్లూఎస్ రిజర్వేషన్లు 10 ఇచ్చిన మోడీ , తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన 42శాతం రిజర్వేషన్లు ఆమోదించకుండా తమ ప్రభుత్వం అగ్రకులాల పక్షపాత ప్రభుత్వం అనీ మోడీ ఋజువు చేసుకొన్నారన్నారు.బీసీల ఓట్లకోసం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీ ప్రకారం అసెంబ్లీలో చట్టం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ చట్టాన్ని 9వ షెడ్యూల్లో చేర్చేందుకు మోడీ ప్రభుత్వం మీదా ఒత్తిడి తేకుండా, నిన్న నర్సంపేట బహిరంగ సభలో రాష్ట్ర అభివృద్ధికి ఢీల్లీనీ ఢీ కొడతా అంటున్నాడనీ, మరీ బీసీ రిజర్వేషన్ల బిల్లును సాధించడానికి ఎందుకు ఢీ కొనడం లేదన్నారు. బీసీల ఓట్ల కోసం మాత్రమే అన్ని పార్టీలు హామీలు ఇస్తూ తర్వాత బీసీలకు వెన్నుపోట్లు పొడుస్తున్నారు న్నారు. రిజర్వేషన్ల బిల్లు సాధించకముందే ఎన్నికలకు పోవడంతో పాటు, విద్య ఉద్యోగాలలో 42 శాతం రిజర్వేషన్లు రాకుండా చేసినందుకు మనస్థాపంతో ఆత్మబలిదానం చేసుకొన్న ఈశ్వరాచారి మరణం సాక్షిగా బీసీలంతా అగ్రకుల పాలకవర్గ పార్టీల కుట్రలను ఎదుర్కోవాలన్నారు. ఈశ్వరాచారి కుటుంబానికి బీసీ సంఘాలు అండగా ఉంటాయన్నారు. బీసీ రిజర్వేషన్లు సాధించడానికి అగ్రకుల పార్టీల వెనకున్న బీసీలను ఒకే వేదికపై తేవడానికి ప్రతీ బీసీ కృషి చేయాలే కానీ, ఆత్మబలిదానాలు చేసుకోకూడదనీ , రాబోయే రోజుల్లో బలమైన బీసీ ఐక్య ఉద్యమాన్ని నిర్మించి రాజ్యాధికారంలోకి రావడమే ఈశ్వరాచారికి ఇచ్చే ఘణమైన నివాళి అన్నారు

-----------------------

కుమారస్వామి 9866079950

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :