సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి నియోజకవర్గంలోని ఓబులదేవర చెరువు మండలంలో నేడు, 25 న సాగే లోకేష్ పాదయాత్ర ఏర్పాట్ల పరిశీలన పై మాజీమంత్రి పల్లె బిజీ బిజీ.నారా లోకేష్ బహిరంగ సభను జయప్రదం చేయండి.తెదేపా శ్రేణులకు మాజీమంత్రి పల్లె పిలుపు.లోకేష్ పాదయాత్ర సాగుతున్న ప్రాంతాల్లో శుక్రవారం పర్యటించి ఏర్పాట్లను మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తో పాటు ఓబులదేవర చెరువు, నల్లమాడ, ఆమడ గూరు మండలలో నీ తెలుగుదేశం ముఖ్య నాయకులు, కార్యకర్తలు పరిశీలించారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లపై తగు సూచనలు, సలహాలు అందించారు. ఓబులదేవర చెరువు మండలం వేమారెడ్డి పల్లి వద్ద ఓ ప్రైవేటు పాఠశాల ఎదురుగా ఏర్పాటుచేసిన బహిరంగ సభ వేదిక ఏర్పాట్లను పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించి తగు సూచనలు చేశారు. బహిరంగ సభకు విచ్చేసిన వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా త్రాగునీరు ,భోజన ఏర్పాట్ల పై స్థానిక టిడిపి నాయకులతో ప్రత్యేకంగా మాట్లాడారు. లోకేష్ పాదయాత్ర ,బహిరంగ సభ ను జయప్రదం చేయాలని నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ కు మద్దతుగా నిలిచి మీ ప్రాంతసమస్యలను ,ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మాజీ మంత్రి టీడీపీ యువనేత లోకేష్ దృష్టికి తీసుకొని రావాలని ఆయన కోరారు. ఇందులో భాగంగా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ ఏపి లో వైసీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. 2024 లో జగన్ ఇంటికే." సైకో పోవాలి...సైకిల్ రావాలని ప్రజలు కోరుకొంటున్నారు. ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో టీడీపీకి వచ్చిన ఫలితాలే నిదర్శనం.మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి .వై ఎస్ జగన్ మోహన్ రెడ్డినే చివరకు వైసీపీ ఎమ్మెల్యేలే నమ్మే పరిస్థితి లేరు.23 ఓట్లతో వైసీపీ ఓటమి...ఇదే దేవుడు జగన్ కు ఇచ్చిన శాపం.టీడీపీ గెలిచేవరకు అసెంబ్లీకి రానని చంద్రబాబు శపథం చేశారు. దేవుడు కూడా మా వైపే ఉన్నాడు కాబట్టి ఈ మధ్య జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి విజయంతో ప్రారంభం.7 సీట్లలో గెలవాలని అత్యాశలో వైసీపీ .ఒక బిసీఎమ్మెల్సీ ని బలి పశువునుచేశారు. బీసీల నమ్మకద్రోహి జగన్ రెడ్డిని రాబోయే ఎన్నికల్లో గద్దె దింపడం ఖాయం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన బిసి మహిళ పంచుమర్తి అనురాధ కు శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి రాజకీయ అపర చాణక్యుడు చంద్రబాబు అంటూ కొనియాడిన మాజీమంత్రి పల్లె.యువ గళం నారా లోకేష్ పాదయాత్రకు పోటెత్తుతున్న జనం. లోకేష్ పాదయాత్రకు వస్తున్న జనాన్ని చూసి వైసీపీ ముఖ్య నేతల్లో మైండ్ బ్లాక్ అవుతోంది . కార్యక్రమంలో మాజీమంత్రి పల్లె వెంట మండల ప్రధాన కార్యదర్శి పీట్ల సుధాకర్ ,మండల కన్వీనర్ జయచంద్ర, మాజీ జెడ్పిటిసి పిట్టా ఓబుల్ రెడ్డి, టీడీపీ నాయకులు బోయపల్లి శివారెడ్డి, నిజాం, మల్లా పల్లి ఓబుల్ రెడ్డి, డాక్టర్ పొగాకు జాకీర్ ,ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు ,వెంకట రంగారెడ్డి ,కంచి సురేష్ , గంటా శ్రీనివాసులు ,చికెన్ షాను ,అంజినప్ప ,ఆరిఫ్ ఖాన్ , షబ్బీర్ ,అంజన రెడ్డి, నారపరెడ్డి ,కుమార్ రాయల్ ,సౌదీ నాగరాజు ,సుధాకర్ ,ఎద్దుల కరుణాకర్ రెడ్డి ,చంద్రశేఖర్ రెడ్డి ,సుబ్రమణ్యం స్వామి, అబ్ల్యూ హుసేన్, టీడీపీ మహిళ నాయకులు వైదేహి, మస్థానమ్మ, భాగ్యమ్మ, ఆషాభి, మల్లీశ్వరి ,తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin