Tuesday, 15 September 2026 01:44:42 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఆంధ్ర పెత్తందారికి వత్తాసు దారులకు హెచ్చరించారు...

Date : 01 December 2022 01:11 AM Views : 468

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : తెలంగాణ రక్షణ సమితి ప్రెస్ మీట్ కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచ ప్రెస్ క్లబ్ లో జరిగినది. ఈ సందర్భంగా తెలంగాణ రక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు నరాల సత్యనారాయణ మాట్లాడుతూ, తెలంగాణలో ఆంధ్ర పార్టీలు బెదిరించే విష సంస్కృతి ఏర్పడినదని, ఎవరికి భయపడేది లేదని, కొంతమంది ఆంధ్ర పార్టీలకు చెందిన చేతకాని వారు వాట్సాప్ లలో మెసేజ్లు పెట్టి వారు ఉనికిని వాళ్లే ప్రశ్నార్థకం చేసుకుంటున్నారని నరాల సత్యనారాయణ హెచ్చరించారు. మన నీళ్లు మన నిధులు, మన నియామకాల తో ఏర్పడిన తెలంగాణలో, సబ్బండ వర్గాలకు మేలు జరగాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అగ్రవర్ణ పేదలకు న్యాయం జరగాలని తెలంగాణ రక్షణ సమితి ఆవిర్భవించినది అని పేర్కొన్నారు. ఆంధ్ర పెత్తందారికి వత్తాసు పలుకుతున్న తెలంగాణలోని కొంతమంది వ్యక్తులను హెచ్చరిస్తున్నాం. నోటికొచ్చినట్లు మాట్లాడిన, ఇష్టం వచ్చినట్లు వాట్సప్ గ్రూపులలో మెసేజ్లు పెట్టిన తగిన మూల్యం చెల్లించక తప్పదు. 1300 మంది కుటుంబాల త్యాగ ఫలితంగా తెలంగాణ ఏర్పడినది. తెలంగాణ తొలి దశ, మలిదశ ఉద్యమకారులను కాపాడుకోవడం కోసం, తెలంగాణ మేధావులు, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు మద్దతు పలుకు తున్న ఈ తరుణంలో తెలంగాణ రక్షణ సమితి అన్ని వర్గాల సంక్షేమం కోసం పని చేస్తుందని తెలియజేశారు. ఆంధ్ర పెత్తందారి వ్యవస్థను తిప్పి కొడుతుందని, ఎవరైనా మితిమీరి తెలంగాణ ఉద్యమకారులను కానీ, తెలంగాణ మేధావులను కానీ, తెలంగాణలో ఉన్న పార్టీలను గాని, వ్యవస్థలను గాని, వ్యక్తులను, గాని కించపరిచే విధంగా ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని, మన తెలంగాణలో ఆంధ్ర పెత్తందారీ వ్యవస్థ నుతిప్పి కొట్టాలని, వారి ఆస్తులను కాపాడుకోవడానికి, వారి దురహంకారాన్ని తెలంగాణ ప్రజల మీద చలా ఇస్తామంటే ఊరుకునే ప్రసక్తి లేదని, ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో తెలంగాణ రక్షణ సమితికి వేలాది మంది కార్యకర్తలు ఏర్పడ్డారని, ఆంధ్ర పెత్తందారీ వ్యవస్థ మా తెలంగాణపై, మా తెలంగాణ ప్రజలపై జులుంపాలని చూస్తే, ఊరుకునే ప్రసక్తే లేదని నరాల సత్యనారాయణ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిన పాక ఎమ్మెల్యే అభ్యర్థిని పూనెం సీతక్క, సత్తుపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిని గొడ్ల శ్రీలత, తెలంగాణ రక్షణ సమితి రాష్ట్ర కమిటీ సభ్యులు, ఇటుకల మాధవి, షేక్ ఆరిఫా, రాగుల కుసుమ, ఎండి సమీం, నాగరాజు, లక్ష్మి, నాగేశ్వరరావు, దుర్గ తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: