సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : తలుపుల మండల కేంద్రంలో స్థానిక బిసి హాస్టల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంపీపీ మహమ్మద్ రఫీ నాయక్ హాస్టల్ వార్డెన్ భాస్కర్ ను హాస్టల్లో భోజన వసతి స్టాక్ ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పిల్లలతో మెనూ ప్రకారం భోజనం వడ్డిస్తున్నారని పిల్లలతో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పిల్లలు మాట్లాడుతూ హాస్టల్లో తమకు మెనూ ప్రకారం భోజనం వడ్డిస్తున్నారని ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది బాగా చూసుకుంటున్నారని సమాధానం ఇచ్చారు అలాగే తమకు హాస్టల్లో ట్యూటర్లు రెండు మూడు నెలల నుంచి హాస్టల్ కు రాలేదని విద్యార్థులు ఎంపీపీ తో తెలిపారు. మాకు సమయపాలన పాటించి మాకు విద్యను అందించే ట్యూటర్లను హాస్టళ్లకు రావాలన్నారు ఇప్పుడున్న ట్యూటర్లను తొలగించవలసిందిగా విద్యార్థులు కోరారు.
-----------------------
Admin