సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గ్ మండల కేంద్రంకి చెందిన బీజేపీ పార్టీ నాయకులు పెరుమాళ్ళ చంద్రశేఖర్, గణేష్ స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు, ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడ్డాక అన్ని వర్గాలకు, అన్ని కుల సంఘాలు, కుల వృత్తులకు ప్రభుత్వం చేయూతనిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణలో అన్ని వర్గాల సంక్షేమం, సర్వమత సమ్మేళనంతో ముందుకు వెళుతుందని స్పష్టం చేశారు. పార్టీ అభ్యున్నతికి ప్రతి కార్యకర్త పాటుపడి ఉండాలని కోరారు. ప్రతి కార్యకర్తను పార్టీ కడుపులో పెట్టుకొని చూసుకుంటుందని పేర్కొన్నారు. పార్టీలో చేరినవారు: సాయి తేజ, మణికంఠ, వెంకటేష్, మహేష్, వరుణ్, మనికాంత్, భరత్, రవి, ప్రశాంత్, బాబు, నవీన్, ఈ. రాజు, నందు, మల్లేష్, శ్రీశైలం, శ్రీను, రఘుపతి తదితరులు ఉన్నారు.
-----------------------
Admin