సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు అవినీతి రాజకీయ కుటుంబ పార్టీలేనని వీరి వల్ల రాష్ట్రానికి, దేశానికి ఎలాంటి ఉపయోగం లేదని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి విమర్శించారు. షాద్ నగర్ బిజెపి అభ్యర్థి అందె బాబయ్యకు మద్దతుగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి క్రిష్టియన్ కాలనీలో బిజెపి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాతపల్లి కృష్ణా రెడ్డి, చెట్ల వెంకటేష్, శ్రీనివాస్ చారి, సాయి కుమార్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీ లకు అధికారం ఇస్తే షాద్ నగర్ ను అభివృద్ధి చేసిందేమి లేదని విమర్శించారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ రెండు ఒకటేనని, కాంగ్రెస్ కు ఓటేసినా బిఆర్ఎస్ కు వేసినట్టే నని అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని ఉచితాలు అంటూ, రాష్ట్రాన్ని అభివృద్ధి లో బలహీన పరుస్తున్నారని మండిపడ్డారు. మళ్ళీ కెసిఆర్ కు ఓటేస్తే అవినీతికి వేసినట్టే అని, తెలంగాణ అభివృద్ధి కావాలంటే బిజెపి తోనే సాధ్యమని అన్నారు. బిజెపి విడుదల చేసిన మేనిఫెస్టో తెలంగాణ పురోగతిని మార్చేయబోతుందని అన్నారు. అవినీతిని ఉక్కు పాదంతో అణిచివేయడంతో పాటుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆలోచనలకు అనుగుణంగా 'సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్' నినాదంతో బిజెపి ప్రభుత్వం పరిపాలన అందిస్తుందని అన్నారు. తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తే సకల జనుల సౌభాగ్య తెలంగాణ కోసం ప్రత్యేక మేనిఫెస్టో లో ధరణి వ్యవస్థ స్థానంలో పారదర్శకమైన 'మీ భూమి' వ్యవస్థను తీసుకొస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్ధవంతంగా అమలు చేయడం కోసం ప్రత్యేక నోడల్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తుందని అన్నారు. ఉద్యోగస్తులు, పింఛనర్లకు ప్రతి నెల ఒకటవ తేదీనే వేతనాలు ఇస్తుందని పేర్కొన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం గత పది ఏళ్లలో చేసిన కుంభకోణాలన్నింటిపై విచారణ కమిటీని ఏర్పాటు చేస్తామని దోషులను న్యాయస్థానం ముందు నిలబెడతుందని అన్నారు. అర్హులైన పేదలకు ఇంటి పట్టాలు అందజేస్తుందని అన్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాల ఆకాంక్షలను నెరవేరుస్తూ, అందరికీ సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధికి బాటలు వేస్తామని, బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని అన్నారు. రాష్ట్రంలోని రైతుల ఎరువుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఎరువుల సబ్సిడీ (ఎకరానికి 18 వేలు) తో పాటుగా చిన్న, సన్న కారు రైతులు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసేందుకు 2,500 రూ ఇన్పుట్ అసిస్టెన్స్ అందిస్తామని అన్నారు. మరియు అయోధ్యలో నిర్మాణమవుతున్న భవ్యమైన రామ మందిరాన్ని వచ్చే ఏడాది జనవరి లో తెలంగాణ ప్రజలకు ఉచితంగా దర్శనం చేయించే బాధ్యత బీజేపీదని అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బిఆర్ఎస్ చెప్పే అబద్దపు హామీలు నమ్మవద్దని కమలం పువ్వు గుర్తుకు ఓటేసి అందె బాబన్న ను భారీ మెజార్టీ తో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమం లో శ్రీనాథ్, ధన్ రాజ్, నాని, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin