Wednesday, 29 July 2026 08:24:38 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బీఎస్పీ నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామికం... - గంధం మల్లికార్జున్

Date : 31 August 2023 05:19 AM Views : 381

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : అరెస్టులతో ప్రజా చైతన్యాన్ని అడ్డుకోలేరని బీఎస్పి జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున్ రావు అన్నారు.హలో బహుజన -చలో సూర్యాపేట కార్యక్రమానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి బయలుదేరిన బీఎస్పి కార్యకర్తలను బుధవారం ఎక్కడికక్కడ అరెస్టు చేయడం దారుణమని అన్నారు.గత అనేక సంవత్సరాలుగా బీఆర్ఎస్ లో పనిచేస్తున్న బీసీ బిడ్డ వడ్డే జానయ్య యాదవ్ సూర్యాపేట నియోజకవర్గం నుంచి అసెంబ్లీ సీటు కోసం ప్రయత్నించడం పాపమైందన్నారు.అసెంబ్లీ సీటును కాంక్షిస్తున్నాడని ఒకే ఒక్క కారణంతో అతనిపై 70 కేసులు నమోదు చేయడమే కాకుండా పిడి యాక్ట్ పెట్టేందుకు సైతం పోలీసులను ఉసిగొలుపుతున్నారని ఆరోపించారు.బీఎస్పీ రాష్ట్ర చీఫ్ డాక్టర్ ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ ఇటీవల సూర్యపేట పర్యటనలో భాగంగా జానయ్యను కలిశారని,అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారని తెలిపారు.దీంతో కక్ష పెంచుకున్న అధికార బీఆర్ఎస్ పార్టీ తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు.ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనగా మారడం ఆయనకు మద్దతుగా బీఎస్పి శ్రేణులు సూర్యాపేటకు బయలుదేరడంతో కొత్తగూడెం ఒకటవ పట్టణ పోలీసులు ఏడుగురిని,సుజాతనగర్ పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారని,పోలీసుల అండతో అధికార బీఆర్ఎస్ ఎక్కడికక్కడ వారిని అరెస్టు చేపిస్తుందని ఆరోపించారు.ఎన్నో ఏళ్లుగా పార్టీకి అంకితభావంతో పని చేస్తూ ఉద్యమ కాలం నుంచి పార్టీలో ఉన్న జానయ్య యాదవ్ టికెట్ అడగడమే తప్పైందని ఆవేదన వ్యక్తం చేశారు.పార్టీ కోసం పనిచేసిన వ్యక్తిగా,ఒక బీసీ గా జానయ్య టికెట్ ఆశించినందుకే ఈ విధంగా వేధింపులకు పాల్పడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.తప్పుడు కేసులు పెట్టి వేధించాలని చూసినా బీఎస్పీ పార్టీ చూస్తూ ఊరుకోదని రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేసేందుకు సైతం వెనకడుగు వేయదని అన్నారు.జిల్లావ్యాప్తంగా అరెస్టు చేసిన బీఎస్పీ కార్యకర్తలను తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు సాయి,జిల్లా సంయుక్త కార్యదర్శి చెనిగారపు నిరంజన్ కుమార్,జిల్లా కార్యదర్శి మాలోత్ వీరు నాయక్,అల్లకొండ శరత్,హరికృష్ణ, సందీప్,గుండేటి ఆదినారాయణ తదితరులను అరెస్టు చేశారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :