సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : నకిలీ విత్తనాలు, మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు అని ధర్మవరం ఏడిఏ కృష్ణయ్య దుకాణదారులను హెచ్చరించారు.... మండల కేంద్రంగా ఉన్న రవి కెమికల్స్& సీడ్స్, శ్రీలక్ష్మి వెంకటేశ్వర ఫర్టిలైజర్స్, మరియు కొండకమర్ల లో వున్న శ్రీ బాలాజి ఫర్టిలైజర్స్, శబరీష్ సీడ్స్ &కెమికల్స్ నందు తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా ముందుగా ఎరువుల, పురుగు మందులు, విత్తనాల రికార్డులను పరిశీలించారు. ఆయా షాపులలో గల ఎరువులు, పురుగుమందులు, విత్త నాల నిల్వ స్టాక్ ను మరియు ఆయా గో డోన్ లలో గలనిల్వ స్టాకులను పరిశీలించారు. రికార్డులలో కొనుగోలు, అమ్మకపు తదితర వివరాలన్నీ ఎప్పటికీ కప్పుడు నమోదు చేస్తో ఉండాలని దుకాణదారులకు ఆదేశించారు. ప్రభుత్వం అనుమతించిన మరియు ధృవీకరించిన మందులు, పురుగుమందులు, విత్తనాలను మాత్రమే అమ్మాలని, ప్రభుత్వం నిర్ణయించిన ధరకు మాత్రమే అమ్మాలని, ధరల వివరాలను ధరల పట్టికలో తప్పకుండా నమోదు చేయాలని, ప్రతి ఒక్క రైతుకి తప్పకుండా రసీదు ఇవ్వాలని ఆదేశించారు. డిజిటల్ రూపంలో కూడా చెల్లింపులు జరిగేలా చూడాలని, అనుమతి పొందని, అన ధికృత ఎరువు, పురుగు మందులు, విత్తనాలను అమ్మరాదని, అధిక ధరలకు అమ్మరాదనే తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి ఇలియాజ్ మహమ్మద్ పాల్గొన్నారు.
-----------------------
Admin