సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : ఎల్బీనగర్, కొత్తపేటలోని మోహన్ నగర్ లో అపోలో డయాగ్నస్టిక్ సెంటర్ 1500 వ పాథాలజీ సెంటర్ ని సోమవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా చీప్ గ్రోత్ ఆఫీసర్ కొండ విశ్వజిత్ రెడ్డి మాట్లాడుతూ వ్యాధిని సకాలంలో గుర్తించడంలో సరైన డయాగ్నస్టిక్స్ కీలకమైన పాత్ర పోషిస్తుందని తెలిపారు. నూతనంగా ప్రారంభించిన పాథాలజీ లో పరీక్షలన్నీ ఒకే చోట చేయించుకునే అందుబాటు ఉందని తెలిపారు. తమ సెంటర్ ద్వారా ఖచ్చితమైన రిపోర్టులను మరియు క్విక్ టెస్టుల సేవలను అందిస్తున్నామని తెలిపారు. రోగులు ఆన్లైన్లో టెస్టులు బుక్ చేసుకోవడం ద్వారా ఇంటి వద్దనే కలెక్షన్స్ సేవలు పొందవచ్చని రిపోర్ట్ లు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అపోలో హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చంద్రశేఖర్, స్టాప్ పాల్గొన్నారు
-----------------------
Admin