Wednesday, 29 July 2026 01:19:57 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడ్డ మహిళ ఏం చేసిందో తెలుసా...?

Date : 18 July 2025 06:05 PM Views : 736

సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ నగరంలోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగద్గిరిగుట్ట గాజులరామారం షిరిడి హిల్స్‌లో నివసించే సుబ్రమణ్యం శ్రీకాంత్ ప్రతి శనివారం కర్మాన్‌ఘాట్ లోని తన తండ్రి ఇంటికి వెళుతూ ఉండేవాడు. అక్కడే తన భర్త నుండి వేరుపడి ఉంటున్న తన చెల్లి కూడా ఉండేది. ఆమె ఆన్లైన్ బెట్టింగులు, క్యాసినోలు ఆడి 5 లక్షల రూపాయలు అప్పులు చేసింది. శ్రీకాంత్ కు ఆయన చెల్లికి కుటుంబ కలహాలు ఉన్నాయి.ఈ క్రమంలో తన అన్న ఇంట్లో ఉండే బంగారాన్ని అపహరించి తన అప్పులు తీర్చుకోవాలని, తన స్నేహితులు అఖిల్, కార్తీక్ తో కలిసి ఆమె పన్నాగం పన్నింది. ఈనెల 5వ తేదీన శ్రీకాంత్ కుటుంబ కర్మాన్ ఘాట్‌కి వెళ్ళగా, ముందుగానే పన్నిన పథకం ప్రకారం శ్రీకాంత్ భార్యకు తెలియకుండా ఆమె పర్సులోని ఇంటి తాళాలు తీసి అదే రాత్రి అఖిల్ కార్తీక్ లకు శ్రీకాంత్ చెల్లి అందజేసింది. వారు ఆ ఇంటి తాళం చెవులను తీసుకొని శ్రీకాంత్ ఇంటికి వచ్చి 12 తులాల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, నగదు అపహరించారు.. అనంతరం తిరిగి కర్మాన్ ఘాట్ వెళ్లి శ్రీకాంత్ చెల్లి చెప్పిన షూర్యాక్ లో తాళం చెవులు దాచి ఉంచి వెళ్లారు. ఇంటికి తిరిగి వచ్చిన శ్రీకాంత్ ఇంట్లో చోరీ అయిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. జగద్గిరిగుట్ట నుండి కర్మాన్‌ఘాట్ వరకు సీసీ కెమెరాలు పరిశీలించి చోరీకి పాల్పడింది శ్రీకాంత్ చెల్లెలు ఆమె స్నేహితులు అఖిల్, కార్తీక్ అని గుర్తించారు.అనంతరం వారిని అరెస్ట్, చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుండి చోరీకి గురైన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, చోరీకి ఉపయోగించిన ఉపకరణాలు స్వాధీనం చేసుకున్నామని జగద్గిరిగుట్ట సీఐ నరసింహ తెలిపారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :