Sunday, 13 September 2026 09:52:07 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన సాగు నీరు దినోత్సవం.

Date : 08 June 2023 09:19 AM Views : 477

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ / తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు నీటి పారుదల శాఖ సాగునీరు దినోత్సవం నిర్వహించారు. దేశానికే అన్నపూర్ణగా తెలంగాణ రాష్ట్రంలో వర్ధిల్లుతున్నదని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని కింగ్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన సాగునీరు దినోత్సవంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ హాజరై ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ.... ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వాలనే లక్ష్యం తో సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని చెప్పారు. 5.4వేల కోట్ల నిధులతో పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా షాద్ నగర్ తో పాటు సమీప నియోజకవర్గాలకు సాగునీరందించేందుకు చర్యలు తీసుకున్నారని చెప్పారు. తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని ఉద్దేశంతో రాష్ట్ర ఏర్పాటు సమయం నుండే సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టి యుద్ధ ప్రాతిపదికన కాలేశ్వరం ప్రాజెక్టుని పూర్తి చేశారని చెప్పారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో నెట్టెంపాడు, బీమా, కల్వకుర్తి కోయిల్ సాగర్ వంటి సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు నీళ్లను ఇస్తున్నారని వివరించారు. షాద్ నగర్ నియోజకవర్గం లోని లక్ష్మీదేవి పల్లె రిజర్వాయర్ కు మల్లన్న సాగర్ నుంచి వచ్చే గోదావరి జాలలను కూడా అనుసంధానము చేయాలానే ఆలోచనలో సీఎం కెసిఆర్ ఉన్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రాజెక్టుల ద్వారా సాగునీరు పెరగడంతో కనివిని ఎరుగని రీతిలో పంట దిగుబడి పెరిగిందని చెప్పారు. ధాన్యము ఉత్పత్తిలో మన రాష్ట్రమే మొదటి స్థానంలో ఉందని, నేడు మన రాష్ట్ర వ్యవసాయ విధానం, ప్రాజెక్టులు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. సుమారు 200 లకు పైగా చెరువులను 32.3 కోట్ల తో బాగు చేసుకున్నామని అన్నారు. గతంలో చెరువుల మరమ్మత్తుల కోసం ఏళ్ల తరబడి నాయకుల చుట్టూ కార్యాలయం చుట్టూ తిరిగేదని నేడు ఆ పరిస్థితి లేదని అన్నారు. రానున్న కాలంలో రైతులకు మేలు చేసే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు రైతులకు అందుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి, జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ ఈటా గణేష్, జడ్పిటిసిలు, ఎంపీపీలు, మార్కెట్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు ఈఈలు, డి ఈ లు, నాయకులు, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: